ప్రస్తుతం శీతాకాలం నడుస్తోంది. శీతాకాలంలో జనాలకు తమ ఆహారం విషయంలో చాలా ప్రశ్నలు మదిలో మెదులుతుంటాయి. అందులో ప్రదమైనది ‘పెరుగు’. వేసవిలో మనం పెరుగును తినడానికి ఎంతో ఇష్టపడతాము. కానీ శీతాకాలం వచ్చిన వెంటనే చాలా మంది పెరుగు తినడం మానేస్తారు. శీతాకాలంలో పెరుగు తినడం వల్ల జలుబు, ఫ్లూ, గొంతు నొప్పి వస్తుందని అనుకుంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముంది, అది అపోహ మాత్రమేనా? అనే విషయం తెలుసుకుందాం. కాల్షియం, భాస్వరం, పొటాషియం సహా బి…