ఒకప్పుడు హెల్తీ ఫుడ్ ను తీసుకొనేవారు.. ఇప్పుడు మాత్రం ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ ను ఇష్టంగా తింటున్నారు.. అయితే బయట స్ట్రీట్ ఫుడ్ తినడం అంత మంచిది కాదు.. వాళ్ళు ఎలా చేస్తారో, ఎలా చేస్తారో కూడా తెలియదు.. అందుకే అలాంటి టేస్ట్ వచ్చేలా ఇంట్లోనే మనం ఫాస్ట్ ఫుడ్ ను చేసుకోవచ్చు.. అందులో ఈరోజు మనం చికెన్ నూడుల్స్ ను ఎలా చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు :
బోన్ లెస్ చికెన్ – 200 గ్రా,
కార్న్ ఫ్లోర్ – 3 టేబుల్ స్పూన్స్,
మైదాపిండి – 3 టేబుల్ స్పూన్స్,
కోడిగుడ్డు – 2, రెడ్ ఫుడ్ కలర్ – చిటికెడు,
నీళ్లు – ఒకటిన్నర లీటర్,
నూడుల్స్ – ఒకటిన్నర చుట్టూ,
నూనె – డీప్ ఫ్రైకు సరిపడా,
క్యారెట్ తరుగు – పావు కప్పు,
క్యాబేజ్ తురుము – అర కప్పు,
పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1,
కరివేపాకు – ఒక రెమ్మ,
సోయా సాస్ – అర టేబుల్ స్పూన్,
ఉప్పు – తగినంత,
కారం – అర టీ స్పూన్,
గ్రీన్ చిల్లీ సాస్ – ఒక టీ స్పూన్,
రెడ్ చిల్లీ సాస్ -ఒక టీ స్పూన్,
గరం మసాలా -అర టీ స్పూన్,
తెల్ల మిరియాల పొడి – అర టీ స్పూన్,
మిరియాల పొడి – అర టీ స్పూన్,
ఆరోమాటిక్ పౌడర్ – అర టీ స్పూన్,
వెనిగర్ – ఒక టీ స్పూన్,
తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ – కొద్దిగా..
తయారీ పదార్థాలు :
ముందుగా చికెన్ ను ఒక గిన్నెలో వేసి బాగా కడిగి పక్కన పెట్టాలి..అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ గరం మసాలా, పావు టీ ఉప్పు, ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. తరువాత ఇందులో చికెన్ ను వేసి కలపాలి. తరువాత కార్న్ ఫ్లోర్, మైదాపిండి వేసి కలపాలి. ఆ తరువాత సగం కోడిగుడ్డును, ఫుడ్ కలర్ ను వేసి బాగా కోట చేసుకోవాలి. దీనిని అలాగే 30 నిమిషాల పాటు మూత పెట్టి పక్కకు ఉంచాలి. ఇక తరువాత గిన్నెలో లీటర్నర నీళ్లు, ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత నూడుల్స్ వేసి 90 శాతం ఉడికించాలి.. తర్వాత ఈ నూడుల్స్ ను జల్లి గంటే తీసుకొని నూడుల్స్ ను వడగట్టుకోవాలి..నూడుల్స్ ను కాసేపు చల్లారనివ్వాలి..స్టవ్ ఆన్ చేసి కడాయిల్ పెట్టాలి..నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చికెన్ ముక్కలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై కరకరలాడే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ ముక్కలను కావల్సిన పరిమాణంలో కట్ చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద కళాయిని స్టవ్ మీద ఉంచి వేడి చెయ్యాలి.. ఇక కళాయి వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి కళాయి అంతా చేసుకోవాలి. నూనె వేడైన తరువాత రెండు కోడిగుడ్లు వేసి వేయించాలి. కోడిగుడ్లు వేగిన తరువాత ఇందులో క్యారెట్ ముక్కలు, క్యాబేజి తురుము, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత వేయించిన చికెన్ ముక్కలు వేసి కలపాలి. తరువాత నూడుల్స్ వేసి కలపాలి.. వీటన్నిటిని బాగా కలిసేవరకు టాస్ చెయ్యాలి..స్ప్రింగ్ ఆనియన్స్ ను చల్లుకుని మరో అర నిమిషం పాటు టాస్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ నూడుల్స్ తయారవుతాయి.. అంతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ నూడుల్స్ రెడీ అయ్యినట్లే..