Health Tips: చలిలో వాకింగ్ చేస్తున్నారా? అయితే మీకు ఈ వ్యాధి రావడం ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Health Tips: చలికాలంలో ఉదయం పూట మంచు కురుస్తున్నా కొంతమంది వాకింగ్ చేస్తుంటారు. మంచు పడుతుండగా అప్పుడే వెచ్చని సూర్యకిరణాలు పడుతున్న సమయంలో వాకింగ్ చేయడాన్ని కొంతమంది ఇష్టపడుతుంటారు. అయితే చలిలో వాకింగ్ చేస్తే అనారోగ్యం బారిన పడతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బెల్స్‌పాల్సీ అనే వ్యాధి బారిన పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ప్రతి ఏడాది శీతాకాలంలో హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో ఇలాంటి కేసులు నమోదవుతుంటాయని.. అందుకే యువత, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెప్తున్నారు.
Read Also: Edible Oil Prices: సామాన్యులకు షాక్.. మళ్లీ పెరగనున్న వంటనూనెల ధరలు
Also Read
- Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
- Cheesy Chicken Sandwich Recipe: నోరూరించే చీజీ ‘చికెన్ శాండ్విచ్’.. బ్రేక్‌ఫాస్ట్, స్నాక్స్ కోసం ఐదు నిమిషాల్లో ఇలా చేసుకోండి!
- WHO: కరోనాను మించిన విధ్వంసం రాబోతుంది.. బాంబు పేల్చిన నివేదిక!
- Rajasthani Khoba Roti Recipe: రెగ్యులర్ రోటీ బోర్ కొట్టిందా..? ఈ కరకరలాడే ప్రత్యేక వంటకం ట్రై చేయండి..
చలిగాలులు చెవుల్లో నుంచి లోపలకు పోవడం వల్ల నాడులపై ప్రభావం పడి ముఖం ఒక పక్కకు లాగేసినట్లు ఏర్పడుతుందని.. మూతి కూడా వంకరపోతుందని.. దీనినే బెల్స్‌పాల్సీ అంటారని వైద్యులు వెల్లడించారు. 60 ఏళ్లు దాటిన వారికి ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మెదడులో కణతులు, గవద బిళ్లలు, ఇన్‌ఫెక్షన్‌ల కారణంగా కూడా బెల్స్‌పాల్సీ సమస్య రావొచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. చలికాలంలో వచ్చే ఈ కేసుల్లో ఎక్కువ శాతం చల్లని వాతావరణం కారణంగానే పెరుగుతుంటాయని.. ఈ వ్యాధిని వెంటనే గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే శాశ్వతంగా ఈ సమస్య వేధిస్తుందని చెప్పారు. అందువల్ల శీతాకాలంలో ఉదయం 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో వాకింగ్ చేయకపోవడమే మంచిదని తెలిపారు. ఎండ వచ్చాక లేదంటే ముక్కు, చెవులు మూసుకునేలా మంకీ క్యాప్ ధరించి ఉదయం 8 గంటల తర్వాత వాకింగ్‌కు వెళ్లడమే ఉత్తమమని వైద్యులు సూచించారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్‌కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!