Health Tips: చలికాలంలో ఉదయం పూట మంచు కురుస్తున్నా కొంతమంది వాకింగ్ చేస్తుంటారు. మంచు పడుతుండగా అప్పుడే వెచ్చని సూర్యకిరణాలు పడుతున్న సమయంలో వాకింగ్ చేయడాన్ని కొంతమంది ఇష్టపడుతుంటారు. అయితే చలిలో వాకింగ్ చేస్తే అనారోగ్యం బారిన పడతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బెల్స్‌పాల్సీ అనే వ్యాధి బారిన పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ప్రతి ఏడాది శీతాకాలంలో హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో ఇలాంటి కేసులు నమోదవుతుంటాయని.. అందుకే యువత, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని…