Rohit Sharma: ఆ ఫోన్ కోసం గంటల తరబడి ఎదురుచూశా.. కునుకు పట్టలేదు.. చివరకు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma Recalls First India Call-Up: టీమిండియా మాజీ కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ తన క్రికెట్ కెరీర్‌లోని మధురమైన జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నాడు. భారత జట్టుకు తొలిసారి ఎంపికైన సందర్భం నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో తన పేరుతో స్టాండ్ ఏర్పాటు చేసిన క్షణం వరకు.. తన తల్లిదండ్రులు ఎంతో గర్వంగా ఫీలైన సందర్భాలను గుర్తుచేసుకున్నాడు. ‘ఫ్యామిలీ ఫుల్ హౌస్ విత్ రోహిత్ శర్మ’ తాజా ఎపిసోడ్లో హిట్‌మ్యాన్.. తన జీవితంలో మర్చిపోలేని అనుభవాలను వివరించాడు. జాస్మీ అనే కంటెస్టెంట్ తన కుటుంబం రోహిత్‌ను కలవబోతున్నందుకు ఎంతో గర్వంగా ఉందని చెప్పింది. ఈ సందర్భంగా తన జీవితంలో తల్లిదండ్రులు అత్యంత గర్వంగా భావించిన సందర్భం ఏదని రోహిత్‌ను ప్రశ్నించింది. దీనికి స్పందించిన హిట్‌మ్యాన్.. భారత జట్టుకు తొలిసారి ఎంపికైన రోజును గుర్తుచేసుకున్నాడు.
‘నా కెరీర్లో తొలిసారి టీమిండియాకు ఎంపిక కావడం నాకు గుర్తుండిపోతుంది. ఆ సమయంలో నేను బెంగళూరులో ఉన్నా. ఆరోజు భారత జట్టును సెలక్ట్ చేస్తున్నారని ముందే తెలుసు. ప్రాక్టీస్ ముగించుకుని హోటల్‌కు వెళ్లిన తర్వాత నా చూపంతా ఫోన్‌పైనే ఉంది. టీమిండియాకు ఎంపికైనట్లు శుభవార్త ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూశా. సాధారణంగా ఫోన్ కాల్స్ ఎక్కువగా రావంటే జట్టుకు ఎంపిక కాలేదని అర్ధం. అందుకే ఆ రోజు ఫోన్ మోగడం కోసం గంటల తరబడి ఎదురుచూశా. మధ్యాహ్నం సమయంలో కునుకు పట్టలేదు. దాదాపు గంట లేదా రెండు గంటల పాటు ఫోన్ పక్కనే కూర్చున్నా. చివరకు సాయంత్రం ఐదు గంటల సమయంలో ఫోన్ మోగింది. రింగ్ పూర్తయ్యేలోపే వెంటనే కాల్ లిఫ్ట్ చేశా. బీసీసీఐ నుంచి వచ్చిన ఆ ఫోన్ కాల్లో భారత జట్టుకు ఎంపికైనట్లు సమాచారం అందింది’ అని రోహిత్ శర్మ గుర్తుచేసుకున్నాడు.
Also Read
- Suryakumar Yadav: "ప్రధాని మోడీని కలిశాకే నా లక్ మారింది.. మళ్లీ ఫామ్‌లోకి వచ్చా".. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
- IND vs NZ: నికోల్స్ అజేయ సెంచరీ.. ఫిలిప్స్ శతకం.. తొలి ఇన్నింగ్స్ న్యూజిలాండ్ ఆలౌట్!
- WTC 2025-27 Points Table: బంగ్లాపై దక్షిణాఫ్రికా ఘన విజయం.. మారిన డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎక్కడంటే!
‘ఆ శుభవార్త విన్న వెంటనే నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బెడ్‌పై నుంచి ఒక్కసారిగా ఎగిరి దూకాను. గాయమైనంత పనైంది కానీ ఏం కాలేదు. నేను అంత ఉత్సాహంతో ఉన్నాను. ఎక్కడికక్కడ పరుగులు పెడుతూ ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాను. ఆ తర్వాత కొంతసేపు ఇది నిజమా, కలా అని నన్ను నేను ప్రశ్నించుకున్నా. అది నిజమేనని నిర్ధారించుకున్నాక తల్లిదండ్రులకు విషయం చెప్పా. వారు ఎంతో సంతోషించారు. ఆ సమయంలో నేను వారి దగ్గర లేకపోయినా.. ఈ వార్త విన్నప్పుడు వారు ఎంత భావోద్వేగానికి గురయ్యారో తర్వాత తెలుసుకున్నా. నా జీవితంలో అదే అత్యంత గర్వకారణమైన క్షణం. నా పేరుతో వాంఖడే స్టేడియంలో స్టాండ్ ఏర్పాటు చేసిన సందర్భం కూడా నా తల్లిదండ్రులకు ఎంతో ప్రత్యేకమైనది. ఆ కార్యక్రమానికి నా తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. ఆ రోజు అందరూ భావోద్వేగానికి గురయ్యారు. చిన్నప్పటి నుంచి వాంఖడే స్టేడియంలో ఆడే అవకాశం వస్తుందా లేదా అని ఆలోచించేవాడిని. అలాంటి మైదానంలో నా పేరుతో స్టాండ్ ఏర్పాటు చేయడం ఊహించని అనుభూతి’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. తన తండ్రి వాంఖడేలో కార్యక్రమం జరిగిన రోజంతా తనతో ఒక్క మాట కూడా మాట్లాడలేదని రోహిత్ గుర్తుచేసుకున్నాడు. అంతగా భావోద్వేగానికి గురయ్యారని, మరుసటి రోజు మాత్రమే తన మనసులోని భావాలను చెప్పగలిగారని వివరించాడు.
2024లో టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత వాంఖడే స్టేడియానికి తిరిగి వచ్చిన సందర్భాన్ని కూడా రోహిత్ గుర్తుచేసుకున్నాడు. ఆ సమయంలో తన తల్లిని కలిశానని, ఆమె ఎంతో సంతోషంగా కనిపించారని చెప్పాడు. భారత జట్టుకు తొలిసారి ఎంపిక కావడం, వాంఖడేలో తన పేరుతో స్టాండ్ ఏర్పాటు చేయడం, ప్రపంచకప్ విజయానంతరం స్వస్థలానికి తిరిగి రావడం.. ఇవన్నీ తన తల్లిదండ్రులు ఎప్పటికీ గర్వంగా గుర్తుచేసుకునే సందర్భాలని రోహిత్ తెలిపాడు. రోహిత్ ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 30 పరుగులు మాత్రమే చేసి.. రెండు సార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు. డిసెంబర్ 13 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో రోహిత్ మళ్లీ బరిలోకి దిగనున్నాడు.
తాజావార్తలు
-
Rohit Sharma: ఆ ఫోన్ కోసం గంటల తరబడి ఎదురుచూశా.. కునుకు పట్టలేదు.. చివరకు..!
-
Motorola Razr Flex 2027: 12GB RAM, 50MP కెమెరా, 165Hz డిస్ప్లే.. Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది!
-
AP MPP Election Results: ఎంపీపీ ఎన్నికల్లో పార్టీల బలమెంత? అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాల పూర్తి లెక్కలివే!
-
Copper Prices: బంగారం, వెండి బాటలోనే రాగి.. ఇక ఏసీలు, ఫ్రిడ్జ్‌లు చౌకగా దొరుకుతాయా?
-
Suryakumar Yadav: “ప్రధాని మోడీని కలిశాకే నా లక్ మారింది.. మళ్లీ ఫామ్‌లోకి వచ్చా”.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!