నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. తాజాగా ఈ పోస్టులకు సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. 2049 కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది… ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
అర్హతలు..
పోస్ట్‌ల స్థాయిని బట్టి 2024,మార్చి 18 నాటికి పదో తరగతి, ఇంటర్మీడియెట్, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2024, జూన్ 13 నాటికి ఆయా అర్హతలు పొందే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు..
పోస్ట్‌ను అనుసరించి జూన్ 1, 2024 నాటికి కనీస వయసు 18 ఏళ్లు, గరిష్ట వయసు 30 ఏళ్లు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది..
ఎంపిక ప్రక్రియ..
రాత పరీక్ష,అందులో పొందిన మార్కులు, నిర్దిష్ట కటాఫ్ నిబంధనలను అనుసరించి.. మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఈ మెరిట్ జాబితాలో నిలిచిన వారికి తదుపరి దశలో టైపింగ్, డేటాఎంట్రీ, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ విభాగాల్లో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు..
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, మార్చి18
దరఖాస్తుల సవరణకు అవకాశం: మార్చి 22 – మార్చి 24
పరీక్ష తేదీలు: 2024 మే 6-8 తేదీల్లో జరుగనున్నాయి.
వెబ్‌సైట్: https://ssc.nic.in/.. ఈ పోస్టుల గురించి మరిన్ని విషయాలను తెలుసుకోవాలంటే ఈ వెబ్ సైట్ ను పరిశీలించండి..