ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ ఛాన్స్ ను వదులుకోకండి. కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఈ జాబ్స్ సాధిస్తే లైఫ్ లో బెస్ట్ పొజిషన్ లో సెటిల్ అయిపోవచ్చు. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ ఇంజనీరింగ్ అండ్ జియో సైన్స్ విభాగాల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 108 పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీ కానున్న పోస్టుల్లో జియాలజిస్ట్ 05, జియో ఫిజిస్ట్ 03, జియో ఫిజిస్ట్ 02, ఏఈఈ (ప్రొడక్షన్ మెకానికల్/ ప్రొడక్షన్ పెట్రోలియం/ ప్రొడక్షన్ కెమికల్/ డ్రిల్లింగ్ పెట్రోలియం/ మెకానికల్) 98 పోస్టులున్నాయి.
అభ్యర్థులు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో డిగ్రీ, ఎమ్మెస్సీ/ఎంటెక్, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 26-27 ఏళ్లు కలిగి ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.60,000– రూ.1,80,000 జీతం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు రూ. GEN/EWS/OBC రూ. 1000 చెల్లించాలి. SC/ST/PWBD వారికి ఫీజు నుంచి మినహాయింపు కలిపించారు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 23 వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఓఎన్జీసీ అధికారిక వెబ్ సైట్ www.ongcindia.com పై క్లిక్ చేయండి. జాబ్ కోసం ట్రై చేస్తున్నవారు ఈ ఛాన్స్ ను అస్సలు మిస్ చేసుకోకండి.