ప్రభుత్వ ఉద్యోగాల కోసం సెర్చ్ చేస్తున్న వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. GAIL ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 73 పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీకానున్న పోస్టుల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(కెమికల్) 21, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(ఇన్ స్ట్రెమెంటేషన్) 17, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఎలక్ట్రికల్) 14, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(మెకానికల్) 8, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(బీఐఎస్) 13 పోస్టులున్నాయి.
Also Read:Hyderabad: బాలుడి ప్రాణాలు తీసిన లిఫ్ట్.. చికిత్స పొందుతూ మృతి
ఈ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు కెమికల్ / పెట్రోకెమికల్ / కెమికల్ టెక్నాలజీ / పాలిమర్ సైన్స్ / ఇన్స్ట్రుమెంటేషన్ / ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రికల్ / మెకానికల్ / ప్రొడక్షన్ & ఇండస్ట్రియల్ / మాన్యుఫ్యాక్చరింగ్ / మెకానికల్ ఆటోమొబైల్ / కంప్యూటర్ సైన్స్ / ఐటిలో సంబంధిత సబ్జెక్టులో ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 26 సంవత్సరాలకు మించకూడదు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
Also Read:PM Modi: మరో విదేశీ పర్యటనకు మోడీ.. మారిషస్ నేషనల్ డే వేడుకలకు హాజరు
ఈ ఉద్యోగులకు అభ్యర్థుల గేట్ 2025 స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 60,000 నుంచి రూ. 1,80,000 వరకు జీతం అందిస్తారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు మార్చి 18 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.