LIC Recruitment 2025: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) 2025 సంవత్సరానికి భారీ నియామకాలను ప్రకటించింది. మొత్తం 491 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ ఖాళీలలో 81 అసిస్టెంట్ ఇంజినీర్లు, 410 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు ఉన్నారు. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆగస్టు 16, 2025 నుంచి సెప్టెంబర్ 8, 2025 వరకు licindia.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలని ఎల్ఐసీ సూచించింది.
Naveen Patnaik Hospitalized: ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం.. హెల్త్ అప్డేట్ ఏంటంటే..?
ఈ పోస్టులకు దరఖాస్తు చేయదలచిన వారు ఏదైనా గ్రాడ్యుయేషన్, B.Tech/B.E, LLB, CA, ICSI అర్హత కలిగి ఉండాలి. ఇక ఈ ఉద్యోగాలకు వయస్సు పరిమితి విషయానికి వస్తే.. కనీస వయస్సు 21 సంవత్సరాలు కాగా, గరిష్ఠ వయస్సు 30 సంవత్సరాలు. అంతేకాదు ప్రభుత్వ నియమావళి ప్రకారం వయస్సులో రాయితీలు కూడా వర్తిస్తాయి. ఈ ఉద్యోగాల ఎంపిక కోసం రెండు దశల ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించబడతాయి. అందులో మొదటిది ప్రీలిమినరీ ఎగ్జామ్ కాగా, అందులో విజయం సాధిస్తే మెయిన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్ పరీక్షకు 7 రోజుల ముందు అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
India Finds Estimated 20 Tonnes of Gold: భారత్‌లో బంగారు నిధి.. ఎన్ని టన్నులు అంటే?
ఇక దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే.. SC/ST/PwBD అభ్యర్థులకు రూ.85 + GST + ట్రాన్సాక్షన్ ఛార్జీలు కాగా, ఇతర అభ్యర్థులకు రూ.700 + GST + ట్రాన్సాక్షన్ ఛార్జీలు వర్తిస్తాయి. ఇకపోతే ఎల్ఐసీ ఉద్యోగులకు ఆకర్షణీయమైన వేతనాలు ఉంటాయి. అసిస్టెంట్ ఇంజినీర్లు, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లకు ప్రాథమిక జీతం నెలకు రూ.88,635గా నిర్ణయించబడింది. వేతన శ్రేణి ప్రకారం ఇది గరిష్టంగా రూ. 1,69,025 వరకు పెరుగుతుంది. కాబట్టి ఆసక్తి గల నిరుద్యోగ అభ్యర్థులు లేదా మరేదైనా ఉద్యోగమైనా చేసే వారు పూర్తి నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని licindia.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.