ప్రభుత్వ ఉద్యోగాలు చెయ్యాలని భావించేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా ప్రభుత్వం ఇండియన్ స్పెస్ సెంటర్ ఇస్రోలో భారీగా ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.. ఆ ప్రయోగం సక్సెస్ అయ్యింది.. ప్రస్తుతం ఇస్రోలో, సాధారణ డిగ్రీ పూర్తి చేసిన వారు సైతం ఉద్యోగాలు పొందవచ్చు. గ్రాడ్యుయేషన్ అర్హతతో జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలను ఇస్రో భర్తీ చేస్తోంది.. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ను వచ్చే నెలలో నిర్వహించనున్నారు..
ఉద్యోగం వివరాలు :
జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్‌లకు ఎంపికయ్యే అభ్యర్థులు తమకు కేటాయించిన అన్ని పనులను చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా సీనియర్ ఎంప్లాయిస్‌కు ప్రతిరోజు అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ అందించాలి. ఫోన్ కాల్స్‌కు ఆన్సర్ చేయడం, అపాయింట్‌మెంట్స్ షెడ్యూలింగ్, వర్క్ షెడ్యూల్‌ను ఆర్గనైజ్ చేయాలి. ఉన్నతాధికారులు అప్పగించిన వాటిని వెంటనే పూర్తి చెయ్యాలి..
వేతనం :
ఈ పోస్ట్‌కు ఎంపికయ్యే వారికి వార్షిక వేతనం రూ.3 లక్షల నుంచి 3.50 లక్షల మధ్య ఉంటుంది. వార్షిక ప్యాకేజీలో బేసిక్ వేతనంతో పాటు కొన్ని రకాల అలవెన్సులు ఉంటాయి. ప్రధానంగా డియర్‌నెస్ అలవెన్స్, హౌస్‌రెంట్ అలవెన్స్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ కలిసి ఉంటాయి. న్యూ పెన్షన్ స్కీమ్, అభ్యర్థి అతనిపై ఆధారపడిన వారికి మెడికల్ ఫెసిలిటీస్, క్యాంటిన్, క్వార్టర్ ఫెసిలిటీ, లీవ్ ట్రావెల్ అలవెన్స్, గ్రూప్ ఇన్సూరెన్స్, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్‌డ్ వంటి సౌకర్యాలు ఉంటాయి..
గతేడాది డిసెంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 154 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను 2022 డిసెంబర్ 20న ప్రారంభించింది. ఈ గడువు 2023 జనవరి 16న ముగిసింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా రాత పరీక్ష, ఇంటర్వ్యూ రౌండ్ ఉంటాయి. ఆన్‌లైన్ రాత పరీక్ష వచ్చే నెల సెప్టెంబర్ 24న జరగనుంది. ఇందుకోసం అడ్మిట్ కార్డ్‌లను త్వరలో జారీ చేస్తారు. అభ్యర్థులు ఇండియాలోనే ఉన్న ప్రతి సెంటర్ లో పనిచేయాల్సి ఉంటుంది.. ఈ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ ను అధికార వెబ్ సైట్ లో చూడవచ్చు..