ఆన్లైన్ ద్వారా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న ఘటనలను నిత్యం చూస్తూనే ఉన్నాం.. అయిన దొంగలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు.. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది.. సైబర్ నేరగాళ్లు అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. ఇంటి నుంచి పనిచేస్తూ ఆన్‌లైన్‌లో అదనంగా ఆర్జించవచ్చని మభ్యపెడుతూ క్షణాల్లో బాధితుల ఖాతా నుంచి సొమ్మును మాయం చేస్తున్నారు.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. యూట్యూబ్ లో వీడియోను లైక్ షేర్ చెయ్యమన్నారు.. తీరా అకౌంట్ ను ఖాళీ చేశారు.. ఈ ఘటన నోయిడాలో వెలుగు చూసింది..
నోయిడాకు చెందిన మహిళను స్కామర్లు యూట్యూబ్ చానెల్స్‌ను సబ్‌స్క్రైబ్ చేస్తూ ఆదాయం సమకూర్చుకోవచ్చని నమ్మించి ఏకంగా రూ.13 లక్షలుపైగా దోచుకున్నారు.. యూట్యూబ్ వీడియోలను చూడటానికి, లైక్ చేయడానికి సబ్‌స్క్రైబ్ చేయడానికి “వర్క్-ఫ్రమ్-హోమ్ జాబ్ ఆఫర్ తో మోస పోయింది. గ్రేటర్ నోయిడాలోని పంచశీల్ హైనిష్ సొసైటీ నివాసి కార్తీకతో నేరగాళ్లు WhatsApp మరియు టెలిగ్రామ్ లో కనెక్టివిటీ అయ్యారు. ఆమె చేసిన వర్క్ ఫ్రం హోం పనికి మొదట ఆమె ఖాతాలో 150 రూపాయిలు జమ చేశారు. ఆ తరువాత ఆమెకు మాయ మాటలు చెప్పి నాస్‌డాక్‌లో 2 వేల రూపాయిలుపెట్టుబడి పెట్టించారు. లాభంగా అదే రోజున తనకు 3 వేల 150 రూపాయిలు ఇచ్చారని తెలిపింది. ఆతరువాత కార్తీక 5 వేలు,30 వేలు,90 వేల రూపాయిలను దశల వారీగా పంపింది. ఆ తరువాత కూడా 3 లక్షలు ఒకసారి.. ఆ తర్వాత మరో నాలుగు లక్షలు సమర్పించుకుంది..
అలా 13 లక్షలు ఖాళీ అయ్యాయి..యూట్యూబ్ వీడియోలను చూడటానికి, లైక్ చేయడానికి సబ్‌స్క్రైబ్ చేయడానికి వర్క్-ఫ్రమ్-హోమ్ జాబ్ ఆఫర్ తో మోస పోయింది. గ్రేటర్ నోయిడాలోని పంచశీల్ హైనిష్ సొసైటీ నివాసి కార్తీకతో నేరగాళ్లు WhatsApp, టెలిగ్రామ్ లో కనెక్టివిటీ అయ్యారు. ఆమె చేసిన వర్క్ ఫ్రం హోం పనికి మొదట ఆమె ఖాతాలో 150 రూపాయిలు జమ చేశారు. ఆ తరువాత ఆమెకు మాయ మాటలు చెప్పి నాస్‌డాక్‌లో 2 వేల రూపాయిలుపెట్టుబడి పెట్టించారు. లాభంగా అదే రోజున తనకు 3 వేల 150 రూపాయిలు ఇచ్చారని తెలిపింది. ఆతరువాత కార్తీక 5 వేలు,30 వేలు,90 వేల రూపాయిలను దశల వారీగా పంపింది. ఆ తరువాత కూడా 3 లక్షలు ఒకసారి 5 అలా 13:లక్షలు ఖాళీ అయ్యాయి.. దాంతో మోసపోయినట్లు తెలుసుకొని పోలీసులను ఆశ్రయించారు..దాంతో ఈ ఘటన వెలుగు చూసింది..