UPI Transactions: యూపీఐ లావాదేవీల్లో కొత్త చరిత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI Transactions: యూపీఐ లావాదేవీల్లో కొత్త చరిత్ర నమోదైంది. 2022 జూలైలో 6 బిలియన్లకు పైగా ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఈ వివరాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) వెల్లడించింది. 2016 తర్వాత అంటే గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం కావటం విశేషం. యూపీఐ ట్రాన్సాక్షన్లు 2019 అక్టోబర్‌లో తొలిసారి 1 బిలియన్ మార్క్‌ను దాటాయి. మొదటి మూడేళ్లలో కేవలం ఒక బిలియన్ లావాదేవీలే జరగ్గా తర్వాతి మూడేళ్లలో ఏకంగా 5 బిలియన్లు దాటడం గమనార్హం. మన దేశంలో డిజిటల్ పేమెంట్ల సంఖ్య శరవేగంగా వృద్ధి చెందుతోంది అనటానికి ఇది తాజా ఉదాహరణ అని చెప్పొచ్చు.
మన కన్నా అమెరికాలోనే ఎక్కువ
Also Read
- Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
- Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Union Budget 2026: భారత్ ఎంత అప్పు చేయనుందో తెలుసా? రుణాలపై మంత్రి కీలక ప్రకటన..
- Budget 2026: కొత్త పన్ను, కస్టమ్స్ రేట్లు తగ్గింపు, టీడీఎస్ సరళీకరణ.. బడ్జెట్‌లో కీలక మార్పులు
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. ఈ విషయంలో అగ్రరాజ్యం అమెరికా కన్నా మన దేశమే బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఏడాది జులై చివరికి యూఎస్‌లో 32 వేల మందికి పైగా ఉద్యోగులను ఇంటికి పంపగా ఇండియాలో 11 వేల మందికి పైగా ఉద్వాసన పలికారు. అమెరికాతో పోల్చితే ఇది చాలా తక్కువ. యూఎస్‌లోని స్టార్టప్స్, పబ్లిక్ ట్రేడింగ్ కంపెనీలతోపాటు మైక్రోసాఫ్ట్, మెటా(ఫేస్‌బుక్)లూ ఇదే బాట పట్టాయి. స్టాఫ్ తొలగింపునకు సంబంధించిన ఈ డేటాను ‘క్రంచ్‌బేస్’ అనే సంస్థ వెల్లడించింది.
GST revenue collections: జీఎస్టీ చరిత్రలో రెండో అత్యధిక వసూళ్ల రికార్డ్
స్టాక్ మార్కెట్ అప్‌డేట్
ఈవారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 359 పాయింట్లు పెరిగి 57,929.39 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీలో 17,256 పాయింట్లకు పైనే ట్రేడింగ్ జరుగుతోంది. ఎం &ఎం షేర్ విలువ గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డ్ స్థాయిలో పెరిగింది. త్వరలోనే రూ.1500కు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. రిలయెన్స్, మారుతీ, పవర్ గ్రిడ్, టాటా స్టీల్ తదితర సంస్థలకు లాభాలు వచ్చాయి. జేకే పేపర్ 10%, ఆంధ్రా పేపర్ 16% ప్రాఫిట్స్ నమోదు చేశాయి. నిఫ్టీలో మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 విలువ 0.5% పెరిగింది. యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, సన్ ఫార్మాల వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!