Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. ముందుగా ఉగ్రవాద స్థావరాలను దెబ్బతీసిన భారత్, ఆ తర్వాత పాకిస్తాన్ కవ్వింపులకు తీవ్రమైన సమధానం ఇచ్చింది. పాకిస్తాన్ వైమానికదళానికి చెందిన 11 ఎయిర్ బేస్‌లపై అటాక్ చేసింది. ఇందులో నూర్ ఖాన్ ఎయిర్ బేస్, రఫికీ, సర్గోదా, జకోబాబాద్, స్కర్దు వంటికి ఉన్నాయి.
పాకిస్తాన్‌లోని కరాచీ నివాసితులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి మూడు గంటలకు ఒకసారి స్వల్ప భూకంపం వస్తుందని పేర్కొన్నారు. అయితే, ఇప్పటి వరకు 19 స్వల్ప భూకంపాలు సంభవించాయని వెల్లడించారు.
మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది విక్టరీ ర్యాలీపై సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఈ సదర్భంగా ఓ నెటిజన్ ఇలా రాసుకొచ్చాడు.. 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాలు, 26 ఉగ్రవాద లక్ష్యాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) లాంగ్ రేంజ్ వైమానిక జరిపిన దాడులను షాహిద్ అఫ్రిది సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉంది.. ప్రస్తుతం, అతని మానసిక పరిస్థితి బాగాలేదు తక్షణమే చికిత్స అందించాల్సిన అవసరం ఉందన్నాడు.