ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టించిన అల్లకల్లోలం అంతాఇంతా కాదు. చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచంలోని అన్ని దేశాల్లో వ్యాప్తి చెంది ఎంతో మంది జీవితాలను అతలాకుతలం చేసింది. కరోనా కట్టడికి దేశాలు కోవిడ్ టీకాలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. కొన్ని దేశాల్లో కోవిడ్ టీకాలు మెరుగైన ఫలితాలను అందిస్తున్నాయి.
అయితే యూరప్‌లో మరోసారి కరోనా విజృంభిస్తోంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌వో) యూరప్‌కు హెచ్చరికలు జారీ చేసింది. యూరప్‌లో పెరుగుతున్న కరోనా కేసులను కట్టడి చేయకుంటే ఫిబ్రవరి నాటికి 5 లక్షల కరోనా మరణాలు నమోదవుతాయని డబ్లూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది.