New Variants: కరోనా కొత్త వేరియంట్లు.. డబ్ల్యూహెచ్‌వో తాజా వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ దేశాలను, ఆర్థిక వ్యవస్థను, అన్ని రంగాలను ఓ కుదుపుకుదిపిన కరోనా మహమ్మారి భయం ఇంకా వెంటాడుతూనే ఉంది.. ఒమిక్రాన్ రూపంలో థర్డ్వేగా భారత్‌లో విజృంభించిన కోవిడ్ కేసులు ఇప్పుడు భారీగా తగ్గిపోయాయి.. కానీ, కరోనా కరోనా కొత్త వేరియంట్లు కలవరపెడుతూనే ఉన్నాయి.. ఇక, ఇటీవల వెలుగు చూసిన ఒమిక్రాన్‌లో రెండు సబ్ వేరియంట్లు.. బీఏ 4, బీఏ5 ఆందోళన కలిగిస్తున్నాయి.. కొత్త వేరియంట్ల వ్యాప్తి, ప్రభావంపై దృష్టి సారించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో). కొత్త వేరియంట్ల తీవ్రతపై పర్యవేక్షిస్తోన్న డబ్ల్యూహెచ్‌వో ఇప్పటివరకు ఉన్న ఒమిక్రాన్ ఉపరకాల కంటే ఇవి భిన్నంగా ఏమీ లేవని తెలిపింది.. ఇదే సమయంలో.. ఈ వేరియంట్లు కచ్చితంగా మార్పు చెందుతాయని స్పష్టం చేసింది. ఇక కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోలేదని.. మనం మహమ్మారి మధ్యలోనే ఉన్నామంటూ వార్నింగ్ ఇచ్చింది డబ్ల్యూహెచ్‌వో.
Read Also: Power Cuts: వ్యవసాయ విద్యుత్‌లో కోతలు..! క్లారిటీ ఇచ్చిన ట్రాన్స్‌కో సీఎండీ
Also Read
కోవిడ్‌లో పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించి రెండు కొత్త వేరియంట్లను ఇప్పటికే గుర్తించాం.. మునుపటి రకాలతో పోలిస్తే తీవ్రతలో ఎటువంటి మార్పులను గుర్తించలేదని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.. కానీ, ఇది మార్పు చెందే అవకాశం లేకపోలేదని హెచ్చరించింది.. వాటి వాస్తవ పరిస్థితులపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులతో కలిసి పనిచేస్తున్నట్టు డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి మారియా వాన్ కెరోవ్ తెలిపారు.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ తక్కువగానే ఉన్నప్పటికీ.. ఇది ప్రజారోగ్య ముప్పుగానే కొనసాగిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీ కమిటీ పేర్కొన్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
-
Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్మెంట్.. సెల్లో మొబైల్, పెన్‌డ్రైవ్ స్వాధీనం
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. ‘బాండెడ్ క్రైట్’గా గుర్తించిన అటవీ అధికారులు!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!