Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో హౌతీ తిరుగుబాటుదారులు ఒక పెద్ద శక్తిగా ఆవిర్భవించారు. యెమెన్‌లోని వాయవ్య ప్రాంతాన్ని కైవసం చేసుకున్న ఈ షియా మిలిటెంట్ గ్రూప్, కేవలం దేశీయ ప్రభుత్వాన్ని ఎదిరించడమే కాకుండా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వణికించే స్థాయికి ఎదిగింది. ముఖ్యంగా ఎర్రసముద్రం , బాబ్ ఎల్-మండేబ్ జలసంధి గుండా సాగే అంతర్జాతీయ నౌకాయానాన్ని దిగ్బంధించడం ద్వారా ప్రపంచ వాణిజ్యానికి తీవ్ర అంతరాయం కలిగించారు. ఇరాన్ మద్దతుతో అధునాతన క్షిపణులు, డ్రోన్లను సంపాదిస్తూ, సౌదీ అరేబియా లాంటి శక్తివంతమైన దేశాల రక్షణ వ్యవస్థలను సైతం సవాల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హౌతీల మూలాలు, వారి దాడుల వెనుక ఉన్న అసలు కారణాలను ఇక్కడ తెలుసుకుందాం.
హౌతీలు యెమెన్‌లోని వాయవ్య ప్రాంతాన్ని పాలించే ఒక సైనిక, రాజకీయా, మతపరమైన సమూహం. అన్సార్ అల్లాహ్ (దేవుని రక్షకులు) అని పిలువబడే ఈ గ్రూప్, 1990లలో యెమెన్ ఉత్తర ప్రాంతంలో షియా ఇస్లాంకు చెందిన ‘జైదీ’ వర్గాన్ని పునరుద్ధరించేందుకు ఒక ఉద్యమంగా ప్రారంభమైంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆర్థికంగా వెనుకబడిన ఉత్తర ప్రాంత ప్రజల హక్కుల కోసం వీరు పోరాడారు. వ్యవస్థాపకుడు హుస్సేన్ బద్రుద్దీన్ అల్-హౌతీ పేరు మీదుగా వీరికి హౌతీలు అనే పేరు వచ్చింది.
Also Read
- Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
- Konda Surekha: "అప్పట్లో రాజకీయ పరిస్థితుల వల్లే అలా అన్నాను".. కేటీఆర్‌పై ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కొండా సురేఖ
- Chennai: పట్టపగలే దారుణం.. బిర్యానీ సెంటర్ క్యాషియర్‌పై కత్తులతో దాడి, నగదు లూటీ..!
- NEET UG: నీట్-యూజీ వివాదం ఎఫెక్ట్.. పరీక్షల సంస్కరణలపై పార్లమెంటరీ కమిటీ ఫోకస్..
2011 అరబ్ స్ప్రింగ్ నిరసనల సమయంలో అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సాలెహ్ పదవి నుంచి దిగిపోవడంతో ఈ గ్రూప్ మరింత బలపడింది. 2014లో యెమెన్ రాజధాని సనాను ఆక్రమించి, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వాన్ని దక్షిణ ప్రాంతానికి తరిమికొట్టాయి. యెమెన్‌లోని మూడో వంతు భూభాగాన్ని, దాదాపు 70 శాతం జనాభాను తమ నియంత్రణలో ఉంచుకున్న ఈ గ్రూప్‌లో సుమారు 1,80,000 నుంచి 2,00,000 మంది సాయుధ యోధులు ఉన్నారు. ట్యాంకులు, యాంటీ-ట్యాంక్ క్షిపణులతో పాటు, అధునాతన ‘పాలస్తీనా-2’ హైపర్సోనిక్ క్షిపణులు, ‘తూఫాన్’, ‘బుర్కాన్’ వంటి సుదూర ప్రాంతాలకు దూసుకెళ్లే డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు వీరి వద్ద ఉన్నాయి.
యెమెన్ సరిహద్దుల్లో ఇరాన్ ప్రభావం పెరగడాన్ని అడ్డుకోవడానికి, అస్థిరతను నివారించడానికి సౌదీ అరేబియా 2015 ప్రారంభంలో యెమెన్ ప్రభుత్వం తరఫున హౌతీలపై సైనిక దాడిని ప్రారంభించింది. దీనికి ప్రతికారంగా హౌతీలు సౌదీ విమానాశ్రయాలు, చమురు ప్రాసెసింగ్ కేంద్రాలు , సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేయడం మొదలుపెట్టారు. ఇరాన్ సారథ్యంలోని యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ లో భాగంగా ఉన్న హౌతీలు, ప్రాంతీయంగా సౌదీకి వ్యతిరేకంగా ఇరాన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌తో ఇరాన్‌కు జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో.. ఎర్రసముద్రం ద్వారా సాగే చమురు ఎగుమతులను అడ్డుకుంటూ సౌదీ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే లక్ష్యంగా హౌతీలు తమ దాడులను మరింత తీవ్రతరం చేశారు.
అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన బాబ్ ఎల్-మండేబ్ జలసంధి సమీపంలో యెమెన్ ఉండటం హౌతీలకు పెద్ద ఆయుధంగా మారింది. ప్రపంచ నౌకా వ్యాపారంలో 10 నుండి 12 శాతం ఈ మార్గం గుండానే సాగుతుంది. గాజా యుద్ధంలో పాలస్తీనీయులకు మద్దతుగా నవంబర్ 2023 నుంచి ఎర్రసముద్రంలో సరుకు రవాణా నౌకలు, ఆయిల్ ట్యాంకర్లపై హౌతీలు దాడులు చేస్తూ నౌకాయానాన్ని దిగ్బంధించారు. ఈ దాడుల భయంతో కార్గో నౌకలు ఐరోపా, ఆసియా మధ్య ప్రయాణించడానికి ఆఫ్రికాను చుట్టి సుదీర్ఘ మార్గంలో వెళ్లాల్సి వస్తోంది. ఇది రవాణా వ్యయాన్ని విపరీతంగా పెంచి, ప్రపంచవ్యాప్తంగా చమురు, నిత్యావసరాల ధరల సంక్షోభానికి కారణమైంది.
అపారమైన రక్షణ బడ్జెట్ ఉన్నప్పటికీ సౌదీ అరేబియా హౌతీలను అణచివేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. యెమెన్‌లోని కఠినమైన పర్వత ప్రాంతాలు, ఎడారి భూభాగాలు హౌతీలకు గెరిల్లా యుద్ధానికి పూర్తి అనుకూలంగా ఉండటంతో వైమానిక దాడుల ద్వారా వారిని అంతం చేయడం కష్టతరమైంది. అంతేకాకుండా.. సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థలను గందరగోళానికి గురిచేయడానికి హౌతీలు భిన్న వేగాలతో వచ్చే డ్రోన్లు, క్షిపణులను ఒకేసారి ప్రయోగిస్తున్నారు. అమెరికా , మిత్రదేశాలు హౌతీలకు ఇరాన్ నిధులు, ఆయుధాలు, శిక్షణ ఇస్తోందని ఆరోపిస్తున్నప్పటికీ.. హౌతీలు తాము ఇరాన్ ప్రాక్సీ కాదని, స్వంత ఆయుధ సాంకేతికతను వాడుతూ దేశీయ ప్రయోజనాల కోసమే పోరాడుతున్నామని స్పష్టం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Honor X8e 4G: హానర్ X8e 4G లాంచ్.. 108MP కెమెరా, 7,700mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్!
-
Konda Surekha: “అప్పట్లో రాజకీయ పరిస్థితుల వల్లే అలా అన్నాను”.. కేటీఆర్‌పై ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కొండా సురేఖ
-
IPL 2027-CSK: శివమ్ దూబే ఒక్కడే సరిపోడు.. సీఎస్కే భారీ ఆఫర్ ఇవ్వాల్సిందే!
-
Chennai: పట్టపగలే దారుణం.. బిర్యానీ సెంటర్ క్యాషియర్‌పై కత్తులతో దాడి, నగదు లూటీ..!
ట్రెండింగ్
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!