Whisleblower Shocks To Twitter: ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్‌కి ఊహించని షాక్ తగిలింది. ట్విటర్‌లో చాలా సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని.. ‘విజిల్ బ్లోయర్’ తాజాగా బాంబ్ పేల్చింది. ఇటీవల కాంగ్రెస్, ఫెడరల్ ట్రేడ్ కమీషన్(FTC)తో మాట్లాడినప్పుడు.. విజిల్ బ్లోయర్ ఆ విషయాన్ని వెల్లడించింది. ట్విటర్‌లోని కొంతమంది ఇంజనీర్లు ఇప్పటికీ ‘గాడ్‌మోడ్’ అనే అంతర్గత ప్రోగ్రామ్‌కు యాక్సెస్ కలిగి ఉన్నారని.. దాని ద్వారా వాళ్లు ఎవరి ట్విటర్ అకౌంట్‌లోనైనా లాగిన్ అయి, ట్వీట్ చేయొచ్చని పేర్కొంది. అంటే.. పాస్‌వర్డ్ రక్షణతో సంబంధం లేకుండా.. ఆ ఇంజినీర్లు ఎవరి ట్విటర్ ఖాతాను అయినా యాక్సెస్ చేయవచ్చు.
Ukraine Crisis: నాటోలో తొలగిన విభేదాలు.. ఉక్రెయిన్ చేతికి అత్యాధునిక యుద్ధ ట్యాంకులు
నిజానికి.. ఎలాన్ మాస్క్ ట్విటర్ బాస్‌గా బాధ్యతలు చేపట్టాక, ఈ గాడ్‌మోడ్‌ను ప్రివిలేజ్డ్‌మోడ్‌గా పేరు మార్చారు. ఇలా పేరు మారడం తప్పితే.. భద్రత విషయంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదని విజిల్ బ్లోయర్ సభ్యులు ఆరోపించారు. ట్విటర్ ఉద్యోగులు సాధారణ కోడ్ ద్వారా ఇతరుల అకౌంట్‌లను యాక్సెస్ చేయొచ్చని.. ఈ కోడ్ ‘ఫాల్స్ టు ట్రూ’ అనే ఆప్షన్ మార్చడంతో జరుగుతుందని విజిల్ బ్లోయర్ పేర్కొంది. యూజర్ల అకౌంట్స్‌ను యాక్సిస్ చేసేందుకు.. టెస్ట్ చేసే ప్రొడక్షన్ కంప్యూటర్, శాంపిల్ కోడ్ ఉంటే సరిపోతుందని విజిల్‌బ్లోయర్ తన ఫిర్యాదులో తెలిపింది. వినియోగదారుల భద్రతను ట్విటర్ ఉల్లంఘించడం ఇదేం తొలిసారి కాదు. 2020లో, టీనేజ్ క్రిప్టో స్కామర్‌లు కంపెనీ అంతర్గత వ్యవస్థలను హ్యాక్ చేసి.. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బరాక్ ఒబామా, ఎలాన్ మస్క్, ఇతర ఉన్నత వ్యక్తుల ఖాతాల నుండి నకిలీ ట్వీట్‌లను పంపారు. అప్పుడు ఈ సమస్యని పరిష్కరించామని ట్విటర్ సమర్థించుకుంది.
T.S. High Court : రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర వేడుకలు నిర్వహించాల్సిందే
అసలు ఈ విజిల్ బ్లోయర్ ఎవరు?
వీళ్లు కూడా ఉద్యోగులే. కాకపోతే.. బయటకు కనిపించని హీరోలు. ఏదైనా కంపెనీ అక్రమాలకు పాల్పడుతుంటే, వాటిని వెలుగులోకి తీసుకొచ్చేవారిని ‘విజిల్ బ్లోయర్స్’ అంటారు. అక్రమాలు, అన్యాయాలను సహించలేని వ్యక్తిత్వం కలిగి ఉన్న ఉద్యోగులు.. నియంత్రణ సంస్థలకు రహస్యంగా అక్రమాల గురించి సమాచారం అందిస్తారు. వీరిచ్చే సమాచారంతోనే నియంత్రణ సంస్థలు రంగంలోకి దిగి అక్రమాలు, అవకతవకలపై దర్యాప్తు జరుపుతాయి.
Global Economic Downturn: ఇండియా వాణిజ్యంపై ప్రభావం ప్రారంభం