Imran Khan: భారత్-పాకిస్తాన్ సంబంధాల మధ్య కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు అడ్డంకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wanted To Improve Strained Ties With India During My Tenure, says imran khan: తన హయాంలో భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని తాను కోరుకున్నానని, అయితే కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేయడం అడ్డంకిగా మారిందని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోమవారం అన్నారు. అప్పటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా కూడా భారత్ తో మెరుగైన సంబంధాలకు మొగ్గు చూపారని అన్నారు. అయితే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు అడ్డంకిగా మారిందని ఆయన అన్నారు. లాహోర్ లో జరిగిన విదేశీ జర్నలిస్టులతో సంభాషిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Taj Mahal: తాజ్‌మహల్‌కు తొలిసారిగా ఇంటి పన్ను నోటీసులు.. రూ.1.4 లక్షలు కట్టాలని ఆదేశం
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
- Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
- Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
2019లో భారత్ కాశ్మీర్ హోదాను, ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఆ తరువాత ప్రభుత్వం చర్చలకు ముందుకు రాలేదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. భారత్ ముందుగా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని శాంతి చర్చలు జరపాలని మేం కోరుకుంటున్నామని అన్నారు. అయితే భారతదేశం తరుపున విదేశాంగ విధానం ఎవరు నడుపుతున్నారని పీటీఐ ప్రశ్నించగా.. నేను బాస్ ను నేను విదేశాంగ విధానాన్ని నడుపుతున్నానని ఇమ్రాన్ అన్నారు.
భారత దేశంలో ఎన్నికల ముందు నరేంద్ర మోదీ గెలవాలని, కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలని తను కోరానని ఇమ్రాన్ ఖాన్ గుర్తు చేసుకున్నారు. రైట్ వింగ్ నుంచి వచ్చిన నరేంద్రమోదీ ఈ సమస్యను పరిష్కరిస్తాడని ఇప్పటికీ నమ్ముతున్నానని అందుకే మళ్లీ ఆయన అధికారంలోకి రావాలని.. కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోపై ఘాటుగా స్పందించారు. ఆయన విదేశాలు తిరగడం మానేసి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లాలని అన్నారు. పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఘర్షణలు చెలరేగుతున్నాయని.. 2600 కిలోమీటర్ల సరిహద్దుల్లో ఉద్రికత్త నెలకొందని అన్నారు. భారతదేశం ఆగస్టు5, 2019న ఆర్టికల్ 370 రద్దు చేసింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!