వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో కిడ్నాప్ తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. నికోలస్ మదురోను అమెరికాకు తరలించిన తర్వాత డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించింది.
చాలా రోజుల తర్వాత వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో బహిరంగంగా కనిపించారు. బుధవారం అర్ధరాత్రి నార్వే రాజధాని ఓస్లోలోని గ్రాండ్ హోటల్ దగ్గర ప్రత్యక్షమయ్యారు.