సుంకాలు చట్ట విరుద్ధం అంటూ ఇటీవల అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 7-4 తేడాతో అప్పీల్ కోర్టు న్యాయమూర్తులు తీర్పు వెలువరించారు. ఈ తీర్పుపై అప్పట్లోనే ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయమూర్తులంతా ‘రాడికల్ లెఫ్ట్ గ్రూప్’ అంటూ ముద్ర వేశారు.
ఇది కూడా చదవండి: Bihar: ఓ ఖైదీ కీలక నిర్ణయం.. జైల్లో అత్యాచార బాధితురాలితో పెళ్లి
తాజాగా అప్పీల్ కోర్టు తీర్పుపై ట్రంప్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో కూడా నిరాశ ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే అంశంపై ట్రంప్ స్పందిస్తూ.. సుప్రీంకోర్టు సుంకాలను తగ్గించినా.. రద్దు చేసినా అమెరికా నమ్మశక్యం కాని పేద స్థితికి వెళ్లిపోతుందని వ్యాఖ్యానించారు. చాలా నష్టం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే ఈయూ, జపాన్, దక్షిణ కొరియాతో వాణిజ్య ఒప్పందాలు జరిగాయని.. ఏదైనా జరిగితే నష్టపోవల్సి ఉంటుందని హెచ్చరించారు. సమాఖ్య చట్టం ప్రకారం విస్తృత వాణిజ్య జరిమానాలు విధించే అధ్యక్షుడి అధికారాన్ని ధృవీకరిస్తూ త్వరిత తీర్పును జారీ చేయాలని న్యాయమూర్తులను ట్రంప్ ప్రభుత్వం కోరింది.
కచ్చితంగా సుప్రీంకోర్టులో ఈ కేసును గెలవాలన్నారు. లేకుంటే దేశం చాలా తీవ్రంగా నష్టపోతుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పును బట్టే మనం ధనవంతులుగా మారే అవకాశం ఉంటుందని.. లేదంటే నమ్మశక్యం కాని విధంగా పేదరికంలోకి వెళ్లడం ఖాయమని సూచించారు.
ఇది కూడా చదవండి: Luxury Ship: ప్రారంభించిన నిమిషాల్లోనే మునిగిపోయిన లగ్జరీ నౌక.. వీడియో వైరల్
ఆయా దేశాలపై ట్రంప్ సుంకాలు విధించారు. దీంతో దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో 90 రోజుల వాయిదా వేశారు. అనంతరం అమల్లోకి తెచ్చారు. ఇక భారత్‌పై 25 శాతం సుంకం విధించారు. అయితే రష్యాతో సంబంధం పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధించినట్లు బాంబ్ పేల్చారు. దీంతో భారత్‌పై 50 శాతం సుంకం విధించినట్లైంది. అయితే ట్రంప్ విధించిన సుంకాలను అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టు తప్పుపట్టింది. సుంకాలు చట్ట విరుద్ధం అంటూ తేల్చిచెప్పింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ట్రంప్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ తీర్పును బట్టే తదుపరి పరిణామాలుంటాయి.