Sai Pallavi : సౌత్‌లో మళ్లీ బిజీగా మారుతోన్న సాయి పల్లవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ బుజ్జితల్లి సాయి పల్లవి రెండు బాలీవుడ్ చిత్రాలకు కమిటయ్యిందో లేదో.. నార్త్‌లో సెటిల్ అయిపోతుందని అనుకున్నారు. అబ్బే అదేం లేదు.. జస్ట్ గెస్ట్‌గా వెళ్లానంతే.. సౌత్‌ను మర్చిపోయే సమస్యే లేదంటోంది న్యాచురల్ బ్యూటీ. అన్నట్లుగానే టాలీవుడ్, కోలీవుడ్‌లో మళ్లీ బిజీగా మారుతోంది భానుమతి. తమిళ్ హీరో ధనుష్- అమరన్ ఫేం రాజ్ కుమార్ పెరియస్వామితో కాంబోలో తెరకెక్కుతోన్న మూవీకి కమిటైంది. ఈ ఇద్దరితో సెకండ్ టైమ్ వర్క్ చేయబోతుంది. మారి2లో ధనుష్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది రౌడీ బేబి. అలాగే విజయ్ సేతుపతి, మణిరత్నం సినిమాకు కమిటయ్యిందని టాక్.
తండేల్ తర్వాత బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండి.. టాలీవుడ్ ప్రాజెక్ట్స్ గురించి అప్డేట్ ఇవ్వని సాయి పల్లవి గురించి ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. టాలీవుడ్ దర్శకులతో కొర్రీలు పెట్టుకుని దీపికా వదిలేసిన ప్రాజెక్ట్ కల్కి2కి న్యాచురల్ బ్యూటీ ఫిక్సైందన్న బజ్ గట్టిగానే నడుస్తోంది. సాయి పల్లవి నటనకు నాగ్ అశ్విన్ ఓ ఫ్యాన్ అవ్వడం వల్ల కూడా ఆమెను తీసుకొని ఉండొచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఇదే కాదు.. లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మీ బయోపిక్‌కు సైన్ చేసిందట. గౌతమ్ తిన్ననూరి టేకప్ చేయబోతున్న ఈ ప్రాజెక్ట్.. త్వరలో పట్టాలెక్కబోతున్నట్లు సమాచారం. సౌత్‌లో యునిక్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి ఈ ఏడాది బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది. అక్కడ కూడా టూ డిఫరెంట్ జోనర్ మూవీస్ చేస్తోంది. ఏక్ దిన్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతుంటే.. మైథాలజీ మూవీ రామాయణలో సీతగా కట్టిపడేందుకు ప్లాన్ చేసుకుంటుంది. బాలీవుడ్ ప్రేక్షకులను ఏ క్యారెక్టర్‌తో ఫిదా చేస్తుందో. కల్కి2తో దీపికాను పూర్తిగా మైమరిపిస్తుందో లేదో లెట్స్ వెయిట్.
Also Read
తాజావార్తలు
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
-
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..