Bihar: ఓ ఖైదీ కీలక నిర్ణయం.. జైల్లో అత్యాచార బాధితురాలితో పెళ్లి
- బీహార్ జైల్లో ఓ ఖైదీ కీలక నిర్ణయం
- జైల్లో అత్యాచార బాధితురాలితో పెళ్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సహజంగా కారాగారం అంటే ఒక భిన్నమైన వాతావరణం అంటుంది. పెద్ద ఎత్తున గోడలు.. సెక్యూరిటీతో కట్టుదిట్టమైన భద్రతతో ఉంటుంది. ఖైదీలతో విచిత్రమైన పరిస్థితులుంటాయి. అలాంటి జైలు.. వివాహ వేడుకగా మారిపోయింది. ఓ ఖైదీ.. అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ సంఘటన బీహార్‌లోని మధుబని జిల్లాలోని ఒక జైల్లో జరిగింది.
ఇది కూడా చదవండి: PM Modi: జీఎస్టీపై మోడీ కీలక ట్వీట్
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
2022లో ఖైదీకి చెందిన అన్నయ్య చనిపోయాడు. అనంతరం వదినతో ఖైదీ సంబంధం పెట్టుకున్నాడు. భర్త మరణించిన దగ్గర నుంచి మరిదితోనే సంబంధం పెట్టుకుంది. ఇద్దరూ సహజీవనం చేయడం ప్రారంభించారు. కాలక్రమంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తి 2024, జూన్ 29న స్థానిక మహిళా పోలీస్ స్టేషన్‌లో మరిదిపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అత్యాచార కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.
ఇది కూడా చదవండి: Luxury Ship: ప్రారంభించిన నిమిషాల్లోనే మునిగిపోయిన లగ్జరీ నౌక.. వీడియో వైరల్
అయితే అత్యాచార బాధితురాలు(వదిన)ను పెళ్లి చేసుకుంటానని.. బెయిల్ ఇవ్వాలంటూ ఖైదీ పాట్నా హైకోర్టును అభ్యర్థించాడు. అనంతరం పెళ్లికి దిగువ కోర్టు అనుమతి ఇచ్చింది. జైల్లోనే వివాహ ఏర్పాట్లు చేయాలని అధికారులకు కోర్టు ఆదేశించింది. దీంతో మంగళవారం జైల్లోనే అధికారులు ఏర్పాట్లు చేశారు. జైలు సిబ్బంది.. తోటి ఖైదీల మధ్య వివాహం జరిపించారు. కోర్టు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జైలు యంత్రాంగం ఈ వేడుకకు ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు. బంధువులకు బదులుగా జైలు సిబ్బంది, తోటి ఖైదీలు సాక్షుల పాత్ర పోషించారని పేర్కొన్నారు. కోర్టు ఆదేశానుసారం వివాహం జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు జైలు సూపరింటెండెంట్ ఓం ప్రకాష్ శాంతి భూషణ్ తెలిపారు.
తాజావార్తలు
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Simple Wave Electric Scooter: సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్‌తో 243KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్‌లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!