Ramcharan: మండు వేసవిలో చల్లటి స్ఫూర్తి పంచుతున్న రామ్‌చరణ్ ఫ్యాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Megapower Star: గ్లోబల్ సూపర్‌స్టార్ రామ్‌చరణ్ అభిమానులు మండు వేసవిలో చేసిన చల్లటి కార్యక్రమం అనేక మందికి స్ఫూర్తిని అందించింది. రామ్‌చరణ్ అనగానే సిల్వర్‌స్క్రీన్ మీద ఆయన గ్రేస్ ఎంత గొప్పగా గుర్తుకొస్తుందో, సొసైటీకి ఆయన చేసే సేవలు కూడా అంతే ఘనంగా మదిలో మెదులుతాయి. ఎన్నో అసోసియేషన్ల ద్వారా, ఎన్జీఓల ద్వారా, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానాలు, నేత్రదానాలు, కోవిడ్ ఆపత్కాలంలో పలు రకాల సహాయాలు అందిస్తూనే ఉన్నారు. ఆపన్నులను పలు రకాలుగా ఆదుకుంటూనే ఉన్నారు. అవన్నీ ప్రత్యక్షంగా గమనిస్తున్న అభిమానులు సమాజానికి హితోధికంగా సాయపడాలని ముందుకొచ్చారు.

ముంబై, అంధేరి, భీవండి, జుహూలోని శంకర్ ఆలయం పరిసరాల్లో దాదాపు వెయ్యి మంది రామ్‌చరణ్ ఫ్యాన్స్ సైతం సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేసవి తాపాన్ని తీర్చడానికి దాదాపు తొమ్మిది వేల మందికి మజ్జిగ బాటిల్స్ పంచారు. తమ అభిమాన నటుడు చేసే సేవా కార్యక్రమాలను చూసి స్ఫూర్తి పొందిన అభిమానులు ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. తమ స్టార్‌లాగానే తాము కూడా సమాజం పట్ల బాధ్యతతో ఉండాలని, దయ, కరుణతో వ్యవహరించాలని, నలుగురిలోనూ స్ఫూర్తిపంచాలన్న ధ్యేయంతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మజ్జిగ పంచడం అనేది తమకు వచ్చిన ఆలోచనకు ఒక రూపం మాత్రమేనని వారు తెలిపారు. సమాజంలో సాటి వ్యక్తుల పట్ల సానుకూల దృక్పథం పెరగాలంటే, కచ్చితంగా తమవంతు సాయాన్ని ప్రతి ఒక్కరూ చేయాలనే ఉద్దేశాన్ని పంచుకున్నారు. ఈ నెల 6న ముంబైలోనూ, ఏప్రిల్ 29న షోలాపూర్‌లోనూ ఈ మజ్జిగ పంపిణీ మరియు అన్నదానం కార్యక్రమాలు జరిగాయి. మండు వేసవికి మంచితనంతో, మజ్జిగతోనూ చెక్ పెట్టాలనుకున్నామని వారు అంటున్నారు.
Also Read
- Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్‌లోకి సూర్య సినిమా
- The Paradise: ఏష నాగుల సాంగ్ కి షేక్ అవుతున్న యూట్యూబ్.. 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్!
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
-
Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్‌లోకి సూర్య సినిమా
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
-
Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!