US-China Trade War: అమెరికాకు కీలక లోహాలు, అయస్కాంతాల ఎగుమతిని నిలిపేసిన చైనా..
- అమెరికా చైనాల మధ్య ముదిరిన వాణిజ్య యుద్ధం..
- కీలక లోహాలు, అయస్కాంతాల ఎగుమతుల్ని నిలిపేసిన చైనా..
- రక్షణ, ఎలక్ట్రానిక్, స్పేస్ ప్రోగ్రామ్స్‌లపై ప్రభావం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-China Trade War: అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఇరు దేశాలు కూడా ఒకరిపై ఒకరు భారీ సుంకాలను విధించుకుంటున్నారు. తాజాగా, చైనా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, లోహాలు, అయస్కాంతాల ఎగుమతుల్ని చైనా నిలిపేసింది. ఇవి ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమేకర్లు, ఏరోస్పేస్ తయారీదారులు, సెమీకండక్టర్‌ల తయారీలో విస్తృతంగా వినియోగిస్తారు.
చైనా ప్రభుత్వం ఎగుమతుల కోసం కొత్త నియంత్రణ వ్యవస్థ, విధానాలను రూపొందిస్తోందని, కార్ల నుంచి క్షిపణుల దాకా అన్నింటి తయారీకి అవసరమయ్యే అయస్కాంతాల ఎగుమతుల్ని నిలిపేసినట్లు, అనేక చైనా ఓడరేవుల్లో షిప్‌మెంట్స్ ఉన్నట్లు ది న్యూయార్క్ టైమ్స్ నివేదిక తెలిపింది. నివేదికల ప్రకారం, కొత్త నియంత్రణ వ్యవస్థ అమలులోకి వచ్చిన తర్వాత అమెరికన్ మిలిటరీ కాంట్రాక్టర్లతో సహా అన్ని కంపెనీలకు వస్తువులు చేరకుండా శాశ్వతంగా నిరోధించవచ్చని తెలుస్తోంది.
Also Read
చైనా దిగుమతులపై ఆధారపడిన యూఎస్..
అమెరికా చాలా వరకు చైనా దిగుమతులపై ఆధారపడింది. దీంతో చైనా ట్రంప్ సుంకాలకు ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభించింది. చైనా ప్రపంచంలోనే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌లో దాదాపుగా 90 శాతం ఉత్పత్తిని కలిగి ఉంది. ఇది రక్షణ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ అండ్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. రేర్ ఎర్త్ మూలకాల్లో 17ఉన్నాయి. సమారియం, గాడోలినియం, టెర్బియం, డిస్ప్రోసియం, లుటేటియం, స్కాండియం, యట్రియం-సంబంధిత వస్తువులతో సహా ఏడు వర్గాల మధ్యస్థ, భారీ అరుదైన ఎర్త్‌లను ఎగుమతి నియంత్రణ జాబితాలో ఉంచారు.
అమెరికా వద్ద కేవలం ఒకే ఒక్క రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌ని వెలికి తీసే గి ఉంది. ఎక్కువ మొత్తాన్ని చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది. ట్రంప్ చైనా ఉత్పత్తులపై 54 శాతం సుంకాలను విధించాలనే నిర్ణయానికి ప్రతీకారంగా చైనా ఏప్రిల్ 02 నుంచి అదురైన ఎర్త్ మూలకాల ఎగుమతులపై ఆంక్షలు విధించింది.
అమెరికాకు ఇవి ఎందుకు కీలకం:
ఎలక్ట్రిక్ కార్లు, డ్రోన్లు, రోబోలు, క్షిపణులు, అంతరిక్ష నౌకలు, ఇంధనంతో నడిచే కార్ల తయారీతో పాటు, ఎలక్ట్రిక్ మోటార్లకు ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చాలా కీలకం. ఈ లోహాలను జెట్ ఇంజన్లు, లేజర్‌లు, కార్ హెడ్‌లైట్లు, కొన్ని స్పార్క్ ప్లగ్‌లు మరియు కెపాసిటర్‌ల తయారీకి అవసరం. ఇవి కొన్ని ఏఐ సర్వర్లు, స్మార్ట్‌ఫోన్లలోని కంప్యూటర్ చిప్ తయారీలో కూడా ఉపయోగిస్తారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!