భారత్-అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లుగా కనిపిస్తోంది. సుంకాలు కారణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చెడిపోతున్నాయి. నిన్నామొన్నటిదాకా రెండు దేశాల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 25 శాతం సుంకం విధించారు. ఇది భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కాగా.. రాజస్థాన్‌లోని బికనీర్‌లో రెండు ప్రధాన పరిశ్రమలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇది కార్పెట్, ఉన్ని, నమ్కీన్ తోపాటు స్వీట్స్ పరిశ్రమలతో సంబంధం ఉన్న వ్యాపారుల ఆందోళనను పెంచింది.
US-China Trade War: అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఇరు దేశాలు కూడా ఒకరిపై ఒకరు భారీ సుంకాలను విధించుకుంటున్నారు. తాజాగా, చైనా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, లోహాలు, అయస్కాంతాల ఎగుమతుల్ని చైనా నిలిపేసింది. ఇవి ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమేకర్లు, ఏరోస్పేస్ తయారీదారులు, సెమీకండక్టర్‌ల తయారీలో విస్తృతంగా వినియోగిస్తారు.
JPMorgan CEO: డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై ‘‘పరస్పర సుంకాలు’’ విధించడం సొంత దేశంలోని ప్రజలే వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఇటీవల ‘‘హ్యాండ్స్ ఆఫ్’’ నిరసనలు జరిగాయి. యూఎస్ వ్యాప్తంగా పలు నగరాల్లో నిరసనలు మిన్నంటాయి. మరోవైపు, ట్రంప్ టారిఫ్స్ అమలులోకి వచ్చే ముందే, తమకు కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేసేందుకు అమెరికన్లు సూపర్ మార్కెట్లకు క్యూ కట్టారు.
Trump's Tariff: డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు ప్రపంచ దేశాలపై సుంకాలను ప్రకటించబోతున్నాడు. ఏప్రిల్ 2 ‘‘విముక్తి దినోత్సం’’ సందర్భంగా ఇండియాతో పాటు ఇతర దేశాలపై సుంకాలు విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ సుంకాలు ఏ విధంగా ఉంటాయనే దానిపై అంతా ఉత్కంఠత నెలకొంది. పరస్పర సుంకాలు ఏప్రిల్ 3 నుంచి అమలులోకి వస్తాయని వైట్ హౌజ్ మంగళవారం తెలిపింది.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో పాటు అధికంగా సుంకాలు విధించే దేశాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా ట్రంప్ భారత్, చైనా, బ్రెజిల్‌లను ఉద్దేశిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మూడు దేశాలను ‘‘అత్యంత సుంకాల తయారీదారులు’’గా అభివర్ణించారు. తమ ప్రభుత్వం ఈ మూడు దేశాలను ఈ మార్గంలోనే కొనసాగించడానికి అనుమతించదని, ఆమెరికాని మొదటిస్థానంలో ఉంచబోతున్నాము కాబట్టి ఇకపై అలా జరగనవ్వబోము అని…