US-China Trade War: అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఇరు దేశాలు కూడా ఒకరిపై ఒకరు భారీ సుంకాలను విధించుకుంటున్నారు. తాజాగా, చైనా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, లోహాలు, అయస్కాంతాల ఎగుమతుల్ని చైనా నిలిపేసింది. ఇవి ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమేకర్లు, ఏరోస్పేస్ తయారీదారులు, సెమీకండక్టర్‌ల తయారీలో విస్తృతంగా వినియోగిస్తారు.