US arrests Pakistani: డొనాల్డ్ ట్రంప్ సహా మరికొందరి హత్యకు ప్లాన్ చేసిన పాకిస్థానీ..
- డొనాల్డ్ ట్రంప్ సహా కొందరు రాజకీయ నాయకులను చంపేందుకు పాకిస్థానీ కుట్ర..
- అండర్‌కవర్ అధికారితో డీల్ చేస్తుండగా అరెస్ట్ చేసిన అమెరికా పోలీసులు..
- ఇస్లాం దేశాలకు హాని చేసే అమెరికాకు చెందిన వ్యక్తులను అంతం చేయడమే ఆసీఫ్ టార్గెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US arrests Pakistani: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా మరి కొందరు రాజకీయ నాయకులను చంపి వేసేందుకు ఓ పాకిస్థానీ పన్నిన కుట్రను ఎఫ్‌బీఐ భగ్నం చేసింది. నిందితుడికి ఇరాన్‌తో కూడా మంచి సంబంధాలున్నాయని గుర్తించింది. ఈ విషయాన్ని ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టఫర్‌వ్రే పేర్కొన్నారు. ఇరాన్ చేయించే కిరాయి హత్య కుట్రగా దీనిని అభివర్ణించారు. ఈ కేసులో పాకిస్థాన్‌కు చెందిన 46 ఏళ్ల ఆసీఫ్ మర్చెంట్ అమెరికన్లను చంపేందుకు సుపారీ తీసుకునేందుకు ట్రై చేస్తుండగా అమెరికా అధికారులు న్యూయార్క్‌లో అతడ్ని అరెస్టు చేశారు. నిందితుడి టార్గెట్లలో డొనాల్డ్ ట్రంప్ కూడా ఉన్నట్లు సదరు అధికారులు గుర్తించారు.
Read Also: Serena Williams-Restaurant: పారిస్ రెస్టరెంట్‌లో సెరెనాకు అవమానం.. వివరణ ఇచ్చిన మేనేజ్‌మెంట్!
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
కాగా, ఈ కేసులో అరెస్టైన ఆసీఫ్ మర్చెంట్ ఏప్రిల్‌లో పాకిస్థాన్ నుంచి అమెరికాకు వచ్చాడు. అప్పటికే అతడు కొంతకాలం ఇరాన్‌లో జీవనం కొనసాగించినట్లు పేర్కొన్నారు. అతడి అక్కడే ఓ ఫ్యామిలీ ఉండగా.. అమెరికాకు చేరుకోగానే కిరాయి గుండాలను ఏర్పాటు చేయడంలో హెల్ప్ చేస్తాడని భావించిన ఓ వ్యక్తితో కుట్రపై చర్చించాడు. కానీ, సదరు వ్యక్తే పోలీసులకు సమాచారం అందించారు. వాస్తవానికి ఆ కిరాయి హంతకుడి రూపంలో ఉన్న వ్యక్తి అండర్‌కవర్ అధికారిగా సమాచారం.
Read Also: Wayanad: రాజంటే ప్రభాసే.. కేరళకు కోట్ల రూపాయల విరాళం ప్రకటించిన ‘కర్ణ’..
ఇక, సదరు అండర్‌కవర్ అధికారి ఆసీఫ్‌ను జూన్‌లో కొందరు వ్యక్తుల సైతం తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా, హత్యలు మొదలు కావడానికి ముందే తాను అమెరికాను నుంచి వెళ్లిపోతానని ఆసీఫ్ మర్చెంట్ పేర్కొన్నాడని.. ఆ తర్వాత భద్రతలో ఉండే వ్యక్తులను చంపడం గురించి వారికి తెలియజేశాడు. ఇక, ఆ తర్వాత మరో నెల రోజుల తర్వాత కిరాయి హంతకుడి రూపంలోని ఎఫ్‌బీఐ ఏజెంట్‌ను కలిసి.. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ఓ రాజకీయ నేతను హత్య చేసేందుకు 5,000 డాలర్లు అడ్వాన్స్‌గా ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. జులై 12న అమెరికాను వీడేందుకు ట్రై చేస్తుండగా.. అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Devara Controversy : అనిరుధ్.. నా పాట కాపీ చేసినందుకు సంతోషంగా ఉంది..?
అలాగే, పాకిస్థాన్, ఇస్లాం దేశాలకు హాని చేసే అమెరికాకు చెందిన వ్యక్తులను అంతం చేయడం టార్గెట్ గా పెట్టుకున్నట్లు విచారణలో ఆసీఫ్ మార్చంట్ ఒప్పుకున్నాడు. వీరిలో ప్రముఖుల పేర్లు ఉన్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. ఈనేపథ్యంలో పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్ హత్యాయత్నానికి మర్చెంట్‌కు ఏమైనా సంబంధం ఉందా అనే యాంగిల్ లో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసును బ్రూక్లిన్ న్యాయస్థానం విచారణ చేస్తుంది.
తాజావార్తలు
-
Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
-
Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
-
Hide & Silk: సుహాస్ కొత్త సినిమా టైటిల్ ఇదే!
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!