Serena Williams-Restaurant: పారిస్ రెస్టరెంట్‌లో సెరెనాకు అవమానం.. వివరణ ఇచ్చిన మేనేజ్‌మెంట్!
- పారిస్‌లో సెరెనాకు అవమానం
- రెస్టరెంట్ పిక్ షేర్ చేసిన అమెరికా నల్ల కలువ
- వివరణ ఇచ్చిన రెస్టరెంట్ మేనేజ్‌మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paris Restaurant apologises to Serena Williams: అమెరికా నల్ల కలువ, టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్‌కు పారిస్ నగరంలో అవమానం జరిగింది. పారిస్ ఒలింపిక్స్ 2024కు కుటుంబంతో హాజరైన సెరెనాను ఓ రెస్టరెంట్ లోపలికి అనుమతించలేదు. ఈ విషయాన్ని సెరెనా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ‘ఖాళీగా ఉన్న పెనిన్‌సులా రూఫ్‌టాప్ రెస్టరెంట్‌లో తినేందుకు కుటుంబంతో కలిసి వెళ్లాను. అక్కడ నన్ను లోపలికి అనుమతించలేదు. ఇక నా పిల్లలతో ఎప్పుడూ ఆ రెస్టరెంట్‌కు వెళ్లను’ అంటూ రెస్టరెంట్ పిక్ షేర్ చేసి ఒలింపిక్స్ 2024ను ట్యాగ్ చేశారు.
సెరెనా విలియమ్స్ పోస్టుపై పెనిన్‌సులా రెస్టరెంట్ స్టాఫ్ మాక్సిమ్ మన్నెవే స్పందించారు. ‘సెరెనా ఓ స్ట్రోలర్ (చిన్న పిల్లల బండి)తో వచ్చారు. ఆ సమయంలో కేవలం రెండు టేబుళ్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అవి కూడా రిజర్వ్ అయి ఉన్నాయి. సెరెనా వచ్చినప్పుడు నేను లేను. సెరెనాను మా స్టాఫ్ గుర్తించలేకపోవడంతో ఈ సమస్య వచ్చింది. ఇతర క్లయింట్స్‌కు చెప్పినట్లే.. ఆమెకు కూడా సమాధానం ఇచ్చాడు. టేబుల్ ఖాళీ అయ్యేవరకు బార్ వద్ద వేచి ఉండాలని సూచించాడు’ అని మాక్సిమ్ చెప్పారు.
Also Read
Also Read: IND vs SL: మూడో వన్డే మ్యాచ్ టైగా ముగిస్తే.. సూపర్ ఓవర్!
మరోవైపు పెనిన్‌సులా రూఫ్‌టాప్ రెస్టరెంట్ మేనేజ్‌మెంట్ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘సెరెనా అంటే మాకెంతో గౌరవం. మా అతిథుల కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. రిజర్వేషన్ లేకుండా కుటుంబంతో కలిసి వచ్చిన సెరెనాకు మా రూఫ్‌టాప్‌లో అవకాశం కల్పించలేనందుకు మేం చింతిస్తున్నాం. మేం ప్రతిఒక్కరికీ అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఒక్కోసారి కుదరకపోవచ్చు. ఆగస్ట్ 5న మా రూఫ్‌టాప్ బార్ పూర్తిగా బుకింగ్ అయిపోయింది. రెండు టేబుళ్లు ఖాళీగా ఉన్నా అవి రిజర్వ్ అయ్యాయి. మరోచోట సెరెనాకు టేబుల్‌ను కేటాయిస్తామని చెప్పాం. తప్పకుండా ఆమె మరోసారి వస్తారని ఆశిస్తున్నాం’ అని పేర్కొంది.
Yikes @peninsulaparis I’ve been denied access to rooftop to eat in a empty restaurant of nicer places 🫠 but never with my kids. Always a first. 🙄#Olympic2024 pic.twitter.com/lEGJR5WoEn
— Serena Williams (@serenawilliams) August 5, 2024
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!