Pakistan: పాకిస్తాన్‌ని వణికిస్తున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)పై సైనిక చర్యలకు ఆ దేశం సిద్ధమైంది. పాకిస్తాన్‌లో అత్యంత పెద్దదైన బలూచిస్తాన్ ప్రావిన్సుని స్వతంత్ర దేశంగా మార్చాలని బీఎల్ఏ పోరాడుతోంది. ఈ వేర్పాటువాద గ్రూపుపై సైనిక దాడిని ప్రారంభించే ప్రణాళికను పాకిస్తాన్ అధికారులు ప్రకటించారు.