రోజురోజుకు ఆడవారిపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ఈ దారుణాలు వెలుగు చూడడం బాధాకరం.ఇప్పటికే మలయాళ నటుడు విజయ్ బాబు ఒక యువ నటిపై లైంగిక వేధింపులకు గురైన కేసులో సతమతమవుతున్న విషయం విదితమే.. ఇక తాజాగా మరో మలయాళ నటుడు లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కోవడం హాట్ టాపిక్ గా మారింది. మలయాళ నటుడు శ్రీజిత్ రవిపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. మలయాళ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించిన శ్రీజిత్ ఇద్దరు మైనర్ బాలికలను లైంగికంగా వేధించినట్లు పోలీసులు ఫిర్యాదులో తెలిపారు.
జూలై 3 న ఒక పార్క్ లో ఆడుకొంటున్న ఇద్దరు బాలికలను దగ్గరకు తీసుకొని తాకరాని చోట తాకుతూ ఇబ్బందికి గురిచేశాడని బాలికలు తెలిపారు. దీంతో బాలికల తల్లిదండ్రులు శ్రీజిత్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీజిత్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు. అయితే ఇలా లైంగిక ఆరోపణలు ఎదుర్కోవడం శ్రీజిత్ కు కొత్తేమి కాదు. గతంలో కూడా అతడిపై పలు కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటన మాలీవుడ్ లో సంచలనం రేపుతోంది.