UK Inflation Soars, Now Highest In 41 Years: యూకే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్ వ్యాప్తంగా ప్రజల జీవన వ్యయాలు పెరుగున్నాయి. ఇంధనం, ఆహార సంక్షభం తలెత్తుతోంది. జనాలు ఇంధనం, ఆహారంపై పెడుతున్న ఖర్చు పెరుగుతోంది. ద్రవ్యోల్భణం ఎప్పుడూ లేనంతగా పెరిగిపోయింది. 41 ఏళ్ల గరిష్టానికి యూకేలో ద్రవ్యోల్భణం చేరినట్లు బుధవారం కీలక బడ్జెట్ సందర్భంగా వెలువడిన డేటా తెలిపింది.
వినియోగదారుల ధరల సూచి అక్టోబర్ లో 11.1 శాతానికి చేరుకుంది. ఇది 1981 తర్వాత ఇది అత్యధిక స్థాయికి చేరుకుందని నేషనల్ స్టాటిస్టిక్స్ తెలిపింది. సెప్టెంబర్ నెలలో ఇది 10.1 శాతంగా ఉందని తెలిపింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం తరువాత ఆర్థిక ఇబ్బందులతో యూరప్ దేశాలు అల్లాడుతున్నాయి. ముఖ్యంగా ఇంధనం, ఆహారం సంక్షోభం తలెత్తింది. యూరప్ దేశాలకు ప్రధానం ఇంధనం రష్యా నుంచే వస్తుంది. అయితే ఉక్రెయిన్ పై రష్యా దాడితో యూరప్ దేశాలు రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనడం నిలిపివేస్తూ ఆంక్షలు విధించాయి. దీంతో అక్కడ ధరలు విపరీతంగా పెరుగుతన్నాయి. బ్రిటన్ లో అయితే కొన్ని సర్వేల ప్రకారం ప్రజలు తినడాన్ని తగ్గించుకున్నట్లు తేలింది.
Read Also: Amazon Layoffs: ఉద్యోగులకు అమెజాన్ షాక్.. 10వేలమందికి ఊస్టింగ్
విద్యుత్, గ్యాస్ ధరలు పెరగడమే ద్రవ్యోల్భణానికి కారణం అని.. దీని వల్లే 40 ఏళ్ల గరిష్టానికి చేరిందని అక్కడి ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక మంత్రి జెరేమీ హంట్ పుతిన్ ఉక్రెయిన్ పై చేస్తున్న యుద్ధం వల్లే ధరలు పెరిగాయని ఆరోపిస్తున్నారు. బ్రిటన్ ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టలేక లిజ్ ట్రస్ తన ప్రధాని పదవి నుంచి దిగిపోవడంతో రిషి సునాక్ ప్రధాని పదవిని అధిష్టించారు.
ఆర్థిక మాంద్యం పరిస్థితులు దగ్గరపడుతున్నా కొద్ధి కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాల్సి వస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ 1989 తర్వాత ఈ నెలలో మొదటిసారిగా అతిపెద్ద వడ్డీరేట్లను పెంచింది. యూకే ఆర్థిక వ్యవస్థ 2024 నాటికి రికార్డ్ స్థాయిలో ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటుందని అంచానా వేస్తున్నారు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత యూకే ద్రవ్యోల్భణం దాదాపుగా 11 శాతానికి చేరుకుంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ రుణ ఖర్చులను 0.75 శాతం నుంచి 3.0 శాతానికి పెంచింది. ఇక రిటైల్ ధరల సూచీ సెప్టెంబర్‌లో 12.6 శాతం నుండి అక్టోబర్‌లో 14.2 శాతానికి చేరుకుంది.