India Growth: ఈ ఏడాది భారత జీడీపీ వృద్ధి రేటులకు ఢోకా లేదని, భారతదేశం ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉంటుందని పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. 2023లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 6.3 శాతంగా ఉంటుందని తెలిపింది. గతంలోని అంచనాలను సవరించింది. ఏప్రిల్ నెలలో ఊహించినదాని కన్నా బలమైన వినియోగాన్ని భారత మార్కెట్ లో
Russia: న్యూఢిల్లీ నిర్వహించిన జీ20 సమావేశం ‘మైలురాయి’గా మిగిలిపోతుందని రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్ అభివర్ణించారు. G20 అధ్యక్షుడిగా భారతదేశం తొలిసారిగా గ్లోబల్ సౌత్ స్థానాన్ని ఏకీకృతం చేసిందని ఆయన అన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఎజెండా కాకుండా భారత్ వ్యవహరించిందని చెప్పారు. ఉక్రెయిన్-రష్యాల మధ్య కాల్పుల విరమణపై ఆయన స్పందించారు.
Ukraine War: ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి. దాదాపుగా ఏడాదిన్నర గడుస్తున్నా రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్రం అవుతుందే తప్పా.. తగ్గడం లేదు. వెస్ట్రన్ దేశాలు ఇచ్చే ఆయుధ, ఆర్థిక సాయంతో ఉక్రెయిన్, రష్యాను నిలువరిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఉక్రెయన్ ను లక్ష్యంగా చేసుకుని రష్యా క్షిపణుల వర్షాన్ని కురిపించింది. 30 క్రూయిజ్ మిసైళ్లను ప్రయోగించింది. వీటిలో 29 క్షిపణులను కూల్చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది.
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ దారుణంగా దెబ్బతింటోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం అయిన ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్ లోని చాలా భాగాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా రాజధాని కీవ్ తో పాటు రెండో అతిపెద్ద నగరం ఖార్కీవ్ సర్వనాశనం అవుతున్నాయి. దీంతో పాటు మరియోపోల్, సుమీ, ఎల్వీవ్ నగరాలు రష్యా క్షిపణి దాడుల్లో దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే శుక్రవారం రష్యా 70కి పైగా మిస్సైళ్లతో ఉక్రెయిన్ పై విరుచుకుపడింది.
UK Inflation Soars, Now Highest In 41 Years: యూకే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పరిస్థితుల్లో కనిపిస్తోంది. బ్రిటన్ వ్యాప్తంగా ప్రజల జీవన వ్యయాలు పెరుగున్నాయి. ఇంధనం, ఆహార సంక్షభం తలెత్తుతోంది. జనాలు ఇంధనం, ఆహారంపై పెడుతున్న ఖర్చు పెరుగుతోంది. ద్రవ్యోల్భణం ఎప్పుడూ లేనంతగా పెరిగిపోయింది. 41 ఏళ్ల గరిష్టానికి యూకేలో ద్రవ్యోల్భణం చేరినట్లు బుధవారం కీలక బడ్జెట్ సందర్భంగా వెలువడిన డేటా తెలిపింది.
Ukraine Drone Attack On Naval Fleet In Crimea: రష్యా-ఉక్రెయిన్ మధ్య రోజురోజు యుద్ధ తీవ్రత పెరుగుతోంది. క్రిమియాలోని కేర్చ్ బ్రిడ్జ్ కూల్చేసిన తర్వాత నుంచి రష్యా, ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. ఇదిలా ఉంటే క్రిమియాలోని నల్ల సముద్రం ఉన్న రష్యా నౌకాదళంపై డ్రోన్లతో దాడి జరిగింది. ఈ దాడి ఉక్రెయిన్ చేసిందని రష్యా ఆరోపిస్తోంది. అయితే తాము ఈ దాడికి పాల్పడలేదని ఉక్రెయిన్ తోసిపుచ్చుతోంది. రష్యాలో విలీన ప్రాంతమైన క్రిమియాలో సెవాస్టోపోల్ కేంద్రంగా ఇటీవల…