UK Inflation Soars, Now Highest In 41 Years: యూకే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పరిస్థితుల్లో కనిపిస్తోంది. బ్రిటన్ వ్యాప్తంగా ప్రజల జీవన వ్యయాలు పెరుగున్నాయి. ఇంధనం, ఆహార సంక్షభం తలెత్తుతోంది. జనాలు ఇంధనం, ఆహారంపై పెడుతున్న ఖర్చు పెరుగుతోంది. ద్రవ్యోల్భణం ఎప్పుడూ లేనంతగా పెరిగిపోయింది. 41 ఏళ్ల గరిష్టానికి యూకేలో ద్రవ్యోల్భణం చేరినట్లు బుధవారం కీలక బడ్జెట్ సందర్భంగా వెలువడిన డేటా తెలిపింది.