Trump: ఆగస్టు 1 నుంచి సుంకాలు చెల్లించాల్సిందే.. దేశాలకు ట్రంప్ వార్నింగ్
- ఆగస్టు 1 నుంచి సుంకాలు చెల్లించాల్సిందే
- వాణిజ్య దేశాలకు ట్రంప్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగస్టు 1 నుంచి దేశాలు సుంకాలు చెల్లిండం ప్రారంభించాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. టారిఫ్‌లపై ట్రంప్ విధించిన డెడ్‌లైన్ మరో ఐదు రోజుల్లో ముగుస్తోంది. ఏప్రిల్ 2న సుంకాలు ప్రకటించగా.. ఆయా దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో 90 రోజులు తాత్కాలిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ గడువు జూలై 9తో ముగుస్తోంది.
ఇది కూడా చదవండి: Abbaya Chowdary: రానున్న రోజుల్లో ‘అబ్బయ్య చౌదరి 2.0’ చూపిస్తా!
Also Read
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
- Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
- US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
అయితే తాజాగా డెడ్‌లైన్ దగ్గర పడుతుండడంతో ఆయా దేశాలకు అమెరికా లేఖలు పంపిస్తోంది. ఇదే అంశంపై విలేకర్ల సమావేశంలో ప్రస్తావించారు. ఆగస్టు 1 నుంచి వాణిజ్య దేశాలు సుంకాలు చెల్లించాల్సిందేనని.. ఈ మేరకు శుక్రవారం నుంచి లేఖలు పంపిస్తున్నట్లు తెలిపారు. ఇక రాబోయే కొద్ది రోజుల్లో అయితే అదనపు లేఖలు కూడా వస్తాయని పేర్కొ్న్నారు. వాణిజ్య భాగస్వామ దేశాలకు సుంకాల రేట్లను తెలియజేస్తూ లేఖలు ప్రారంభించినట్లు వెల్లడించారు. శుక్రవారం 10-12 దేశాలకు లేఖలు అందుతాయని.. 60-70 శాతం, 10-20 శాతం వరకు సుంకాలు ఉంటాయని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Telangana : వైద్య ఆరోగ్య శాఖలో భారీగా నియామకాలు.. మొత్తం 2,363 పోస్టులకు ఆమోదం
జూలై 9లోగా దేశాలు ఒప్పందాలు చేసుకోకపోతే అధిక రేట్లు విధిస్తామంటూ గతంలోనే ట్రంప్ పలుమార్లు హెచ్చరించారు. ఇప్పటి వరకు యూకే, వియత్నాం ఒప్పందాలు చేసుకున్నాయి. ఇక చైనా కూడా పరస్పరం సుంకాలు తగ్గించుకునేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి.
ఇక భారతదేశంతో అమెరికా ఒప్పందాన్ని కుదుర్చుకోగలదని ట్రంప్ తెలిపారు. ఇరు దేశాలు సుంకాలు తగ్గిస్తాయని.. దీంతో 1.4 బిలియన్ వినియోగదారులు భారత్ మార్కెట్లో అమెరికన్ కంపెనీలు పోటీ పడటానికి సహాయపడుతుందని చెప్పారు. సోయాబీన్స్, గోధుమలు, మొక్కజొన్న, ఆపిల్స్, ఇథనాల్, పాల ఉత్పత్తులు వంటి అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను తగ్గించడం ద్వారా భారతదేశం తన దేశీయ మార్కెట్‌ను గణనీయంగా ప్రారంభించగలదని అమెరికా ఒత్తిడి చేస్తోంది. అయితే వీటిలో చాలా వరకు భారతదేశంలో రాజకీయంగా సున్నితమైనవి. జన్యుపరంగా మార్పు చెందిన పంటలకు సులభమైన మార్కెట్ యాక్సెస్‌ను వాషింగ్టన్ డిమాండ్ చేసింది. అయితే ఆరోగ్యం మరియు నియంత్రణ సమస్యల కారణంగా ఢిల్లీ చాలా కాలంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఒప్పందం జరుగుతుందా? లేదా? అన్నది ఇంకా సందిగ్ధంలోనే ఉంది.
తాజావార్తలు
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
-
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
-
Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..