హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర ముఖ్య నేతలతో కలిసి జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోనీ రోడ్ నంబర్ 5 ,ఇందిరా నగర్ లోని భద్రాచలం కేఫ్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరవాసులకు శుభవార్తను అందించారు. ఆగస్టు ఒకటి నుంచి హైదరాబాద్ లో రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. 50 వేల రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. 2 లక్ష 50 వేల మంది పేర్లు రేషన్ కార్డులో చేర్చాము అని తెలిపారు.…
అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశంతో పాటు ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం.. టేకాప్ అయిన కొన్ని సెకన్లకే కుప్పకూలిపోయింది.
ఆగస్టు 1 నుంచి దేశాలు సుంకాలు చెల్లిండం ప్రారంభించాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. టారిఫ్‌లపై ట్రంప్ విధించిన డెడ్‌లైన్ మరో ఐదు రోజుల్లో ముగుస్తోంది. ఏప్రిల్ 2న సుంకాలు ప్రకటించగా.. ఆయా దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో 90 రోజులు తాత్కాలిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ గడువు జూలై 9తో ముగుస్తోంది.
రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వేస్ మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్‌లలో క్యాటరింగ్ క్యాష్ లెస్ చెల్లింపులు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. తాజా నిర్ణయంతో రైల్వే స్టేషన్‌లో క్యాటరింగ్‌తో సహా అన్ని స్టాల్స్‌లో నగదుకు బదులుగా డిజిటల్ పద్ధతిలో విక్రయిస్తారు. ఇలా చేయకుంటే రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు అధికారులు జరిమానా విధించనున్నారు. డిజిటల్ చెల్లింపుల కోసం విక్రేతలు తప్పనిసరిగా యూపీఐ,…