అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. గాజాలో శాంతి స్థాపనకు పురోగతి సాధించారంటూ ట్రంప్‌ను మోడీ అభినందించారు. ఈ మేరకు ఎక్స్‌లో మోడీ పోస్ట్ చేశారు. శాశ్వత, న్యాయమైన శాంతి కోసం చేసే ప్రయత్నాలకు భారతదేశం ఎప్పుడూ గట్టిగా మద్దతు ఇస్తూనే ఉంటుందని పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలని హమాస్‌తో చర్చలు జరుపుతున్నట్లు ట్రంప్ తెలిపారు. శుక్రవారం ఓవర్ కార్యాలయంలో ట్రంప్ మాట్లాడుతూ.. గాజాలో బందీలుగా ఉన్న వారిని విడుదల చేయాలని హమాస్‌తో చాలా లోతైన చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు
బందీల విడుదల విషయంలో హమాస్ సంచలన ప్రకటన చేసింది. గాజాపై యుద్ధాన్ని ముగిస్తే మిగిలిన ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హమాస్ ప్రకటించింది.
ఎట్టకేలకు బాంబు శబ్ధాలకు గాజాలో పుల్‌స్టాప్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఏడాదికిపైగా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. హమాస్ అంతమే లక్ష్యంగా రాకెట్ దాడులు చేసింది. దీంతో ఆస్తుల ధ్వంసంతో పాటు వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి.