Trump: భారత్‌లో పెట్టుబడులు ఆపండి.. వైట్‌హౌస్ విందులో ఆపిల్ సీఈవోకు ట్రంప్ సూచన
- భారత్‌లో పెట్టుబడులు ఆపండి
- వైట్‌హౌస్ విందులో ఆపిల్ సీఈవోకు ట్రంప్ సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌పై ట్రంప్ కక్ష కట్టినట్లుగా మరోసారి రుజువైంది. ఇప్పటికే సుంకాల పేరుతో భారీ బాదుడు బాదుతున్నారు. తాజాగా వైట్‌హౌస్ వేదికగా టెక్ సీఈవోలకు ప్రత్యేక విందు ఇచ్చారు. ఈ విందు సందర్భంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. భారత్‌లో పెట్టుబడులు ఆపి.. స్వదేశంలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆపిల్ సీఈవోతో ట్రంప్ సంభాషించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Modi-Trump: మోడీ-ట్రంప్ స్నేహం ముగిసింది.. అమెరికా మాజీ సలహాదారు జాన్ బోల్టన్ వ్యాఖ్య
Also Read
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
గురువారం వైట్‌హౌస్‌లో టెక్ సీఈవోలకు ట్రంప్ ప్రత్యేక విందు ఇచ్చారు. ఒక పొడవాటి టేబుల్‌పై ట్రంప్ దంపతులు, సీఈవోలంతా కూర్చున్నారు. ఈ సందర్భంగా గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ సీఈవోలతో ట్రంప్ సంభాషిస్తూ ఇతర దేశాల్లో పెట్టుబడులు ఆపి యూఎస్‌లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. గత మే నెలలో ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌తో ట్రంప్ మాట్లాడుతూ.. ఆపిల్ ఉత్పత్తులను భారత్‌లో నిలిపివేయాలని చెప్పారు. తాజాగా మరోసారి అదే విషయాన్ని మళ్లీ లేవనెత్తారు.

కుక్‌తో ఇలా..
అమెరికాలో ఎంత డబ్బు పెట్టుబడి పెడుతున్నారు? అని కుక్‌ను అడిగారు. చాలా మొత్తంలో పెట్టుబడి పెడుతున్నట్లు తనకు తెలుసు అన్నారు. ఇప్పటి వరకు వేరే చోట ఉన్నారని.. ఇప్పుడు సొంతింటికి వచ్చేస్తున్నారని.. ఎంత పెట్టుబడి పెడుతున్నారని టిమ్ కుక్‌ను ట్రంప్ అడిగారు. దీనికి కుక్ సమాధానం ఇస్తూ.. 600 బిలియన్లు అని బదులిచ్చారు. దీంతో ట్రంప్ ప్రశంసించారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం ఏ మాత్రం తనకు ఇష్టం లేదని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అమెరికాలో బాగా చూసుకుంటామని.. ఇకపై భారత్‌లో పెట్టుబడులు పెట్టొద్దని సూచించారు.
ఇది కూడా చదవండి: Ajit Pawar-IPS: నీకెంత ధైర్యం? మా వాళ్లనే అడ్డుకుంటావా? ఐపీఎస్‌పై డిప్యూటీ సీఎం చిందులు
ఇక విందులో కుడివైపున కూర్చున్న మెటా సీఈవో జుకర్‌బర్గ్‌ను కూడా ట్రంప్ ప్రశ్నించారు. అమెరికాలో మీరెంత పెట్టుబడి పెడుతున్నారని అడిగారు. తాను కూడా 600 బిలియన్లు అని సమాధానం ఇచ్చారు. తదుపరి ప్రశ్న గూగుల్ సీఈవోను అడిగారు. దీనికి ప్రస్తుతతం 100 బిలియన్లకు దగ్గరగా ఉన్నామని.. రాబోయే రెండేళ్లలో 250 బిలియన్లకు చేరుకుంటుందని వెల్లడించారు. ఇక మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. ప్రస్తుతం 75 నుంచి 80 బిలియన్లకు దగ్గరలో ఉన్నట్లు పేర్కొన్నారు. చాలా బాగుంది.. మిమ్మల్ని చూస్తుంటే గర్వగా ఉందని.. మీ అందరికీ ధన్యవాదాలు అంటూ ట్రంప్ ముగించారు.
.@Apple CEO @tim_cook: "I want to thank you for setting the tone such that we could make a major [$600 billion] investment in the United States… That says a lot about your focus and your leadership and your focus on innovation." pic.twitter.com/289vkiB6vy
— Rapid Response 47 (@RapidResponse47) September 5, 2025
తాజావార్తలు
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్‌లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
-
EC Orders Voter List Revision in 17 States: ఓటర్లకు కీలక సమాచారం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఈసీ ఆదేశాలు!
-
Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!