Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oracle layoffs: టెక్ సంస్థల్లో ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ ఆగడం లేదు.. AI ఎంట్రీతో.. ఎప్పుడు ఈ మెయిల్ వస్తుందో అనే టెన్షన్లో టెక్కీలు బిక్కుబిక్కుమంటున్నారు.. మరీ ముఖ్యంగా 6 AM ఈ మెయిల్ వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.. తాజాగా, అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం ఒరాకిల్‌లో మరో విడత ఉద్యోగాల కోతలు ప్రారంభమయ్యాయి. ప్రభావిత ఉద్యోగులకు ఉదయం 6 గంటలకే ఈమెయిల్ పంపి, వారి ఉద్యోగాలు తొలగించినట్లు సంస్థ సమాచారం ఇచ్చినట్లు బిజినెస్ ఇన్సైడర్ నివేదించింది. ఈ తొలగింపులు విస్తృతమైన సంస్థాగత మార్పుల్లో భాగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజా లేఆఫ్స్ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు సమాచారం.
ఉద్యోగులకు అదే రోజు చివరి రోజు
తాజాగా, లేఆఫ్స్‌కు గురైన కొందరు ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయిన విషయాన్ని లింక్డ్ఇన్, రెడిట్, బ్లైండ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో వెల్లడించారు. బిజినెస్ ఇన్సైడర్ ముగ్గురు ప్రభావిత ఉద్యోగులతో మాట్లాడటంతో పాటు, ఉద్యోగులకు పంపిన అంతర్గత నోటిఫికేషన్‌ను పరిశీలించినట్లు తెలిపింది. ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో వారి పాత్ర.. సంస్థాగత మార్పులో భాగంగా ఉద్యోగం నుంచి తొలగించినట్లు పేర్కొన్నట్లుగా సమాచారం. నోటిఫికేషన్ వచ్చిన రోజే వారి చివరి పని దినంగా కూడా పేర్కొన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే తాజా విడతలో ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమయ్యారనే విషయాన్ని ఒరాకిల్ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
భారీగా AIపై ఖర్చు చేస్తున్న ఒరాకిల్
అయితే, ఒరాకిల్ భారీ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్న సమయంలోనే ఈ లేఆఫ్స్ చోటుచేసుకోవడం గమనించదగిన పరిణామం.. AI, క్లౌడ్ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను అందుకోవడానికి కంపెనీ డేటా సెంటర్లపై భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు సాగుతోంది.. 2027 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఒరాకిల్ మూలధన వ్యయం ఏకంగా 28.5 బిలియన్ డాలర్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 8.5 బిలియన్ డాలర్లు మాత్రమే ఉండేది.. అంటే ఏడాది వ్యవధిలో మూడు రెట్లకు పైగా పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి 90 నుంచి 95 బిలియన్ డాలర్ల క్యాపెక్స్ అంచనాను కంపెనీ కొనసాగిస్తోంది.
AI వ్యాపారానికి భారీ డిమాండ్
మరోవైపు.. ఒరాకిల్ AI వ్యాపారంలో కూడా గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తోంది. త్రైమాసికంలో 30 బిలియన్ డాలర్లకు పైగా అదనపు AI క్లౌడ్ కాంట్రాక్టులు కుదుర్చుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో కంపెనీ మొత్తం మిగిలిన పనితీరు బాధ్యతలు (Remaining Performance Obligations – RPO) 664 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే AI విస్తరణకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. త్రైమాసికంలో ఒరాకిల్ ఫ్రీ క్యాష్ ఫ్లో 5.4 బిలియన్ డాలర్ల నెగెటివ్‌గా నమోదైంది. డేటా సెంటర్లపై పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీ ఖర్చులను నియంత్రించేందుకు మరోవైపు ఉద్యోగాల కోతలను కొనసాగిస్తూనే ఉంది ఒరాకిల్..
ఇప్పటికే 21 వేల ఉద్యోగాల కోత
ఇదే తొలిసారి కాదు.. తాజా లేఆఫ్స్ ఈ ఏడాదిలో ఒరాకిల్ చేపట్టిన తొలి ఉద్యోగాల కోత కాదు. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 21,000 మంది ఉద్యోగులను తగ్గించింది. ఇది మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 13 శాతానికి సమానం. ఇక, మే 31తో ముగిసిన 2026 ఆర్థిక సంవత్సరం చివరికి ఒరాకిల్‌లో సుమారు 1,41,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అంతకుముందు ఏడాది ఈ సంఖ్య దాదాపు 1,62,000గా ఉండేవారు.. ఉద్యోగుల తొలగింపులు, ఇతర పునర్వ్యవస్థీకరణ చర్యలకు సంబంధించి 2026 ఆర్థిక సంవత్సరంలో ఒరాకిల్ సుమారు 1.84 బిలియన్ డాలర్లు సెవరెన్స్, ఇతర ఎగ్జిట్ ఖర్చులుగా వెచ్చించింది. అంతకుముందు ఏడాది ఈ వ్యయం 374 మిలియన్ డాలర్లుగా నమోదైంది..
AI కారణంగానే ఉద్యోగాల కోతలు?
అయితే, తమ కార్యకలాపాల్లో AIని స్వీకరించడం, అమలు చేయడం కూడా ఉద్యోగుల సంఖ్య తగ్గడానికి ఒక కారణమని ఒరాకిల్ గతంలో తెలిపిన విషయం విదితమే. ఇదే సమయంలో కంపెనీ పునర్వ్యవస్థీకరణ కార్యక్రమం ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల ఒరాకిల్ తన అంచనా రీస్ట్రక్చరింగ్ ఖర్చులకు మరో 700 మిలియన్ డాలర్లు జోడించింది. దీంతో 2026 ఆర్థిక సంవత్సరం రీస్ట్రక్చరింగ్ ప్రణాళిక మొత్తం అంచనా వ్యయం సుమారు 2.8 బిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో ఉద్యోగుల సెవరెన్స్, కాంట్రాక్టుల రద్దు రుసుములు, ఇతర ఎగ్జిట్ ఖర్చులు ఉన్నాయి. ఆగస్టు 31 నాటికి ఈ ప్రణాళిక కింద సుమారు 2.1 బిలియన్ డాలర్ల ఛార్జీలను ఇప్పటికే నమోదు చేసినట్లు కంపెనీ తెలిపింది. భవిష్యత్తులో చేపట్టబోయే అదనపు చర్యల కారణంగానే మరో 700 మిలియన్ డాలర్ల ఖర్చు అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది.
సెప్టెంబర్ లేఆఫ్స్ ముందే ఊహాగానాలు
ఒరాకిల్‌లో సెప్టెంబర్‌లో మరో విడత ఉద్యోగాల కోతలు ఉండొచ్చనే వార్తలు ముందుగానే వచ్చాయి. AI మౌలిక సదుపాయాల విస్తరణ కోసం భారీగా అప్పులు తీసుకుంటున్న నేపథ్యంలో పేరోల్ ఖర్చులను తగ్గించేందుకు కంపెనీ మరోసారి ఉద్యోగాల సంఖ్యను తగ్గించేందుకు సిద్ధమవుతోందని గత నెలలోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజా ఉద్యోగుల తొలగింపులతో ఆ ప్రణాళిక అమల్లోకి వచ్చినట్లు స్పష్టమవుతోంది. అయితే ఆదాయ వృద్ధితో పాటు AI మౌలిక సదుపాయాల కోసం కంపెనీ ఖర్చులు కూడా భారీగా పెరుగుతున్నాయి. డేటా సెంటర్లు, క్లౌడ్ సామర్థ్యాల విస్తరణకు భారీ పెట్టుబడులు అవసరం కావడంతో ఖర్చులను తగ్గించే చర్యల్లో భాగంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నట్లు విశ్లేషణలు సూచిస్తున్నాయి. ఒరాకిల్ తాజా చర్యలు కంపెనీ వ్యూహంలో ఉన్న విరుద్ధ పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయి. ఒకవైపు AI ఆధారిత క్లౌడ్ సేవలపై భారీగా పెట్టుబడులు పెట్టి భవిష్యత్ డిమాండ్‌ను అందుకునేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. మరోవైపు ఖర్చులను తగ్గించేందుకు ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తోంది.
తాజావార్తలు
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!