GAMA Awards : ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ చిత్రంగా పుష్ప 2
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతిష్టాత్మమైన GAMA (Gulf Academy Movie Awards) అవార్డ్స్ కు టాలీవుడ్‌లో స్పెషల్ క్రేజ్ ఉంది. దుబాయ్‌లో ఇప్పటికే నాలుగు ఎడిషన్లు అంగరంగ వైభవంగా జరిగాయి. తాజాగా వైభవ్ జ్యువెలర్స్ సమర్పణలో Keinfra Properties 5వ ఎడిషన్ వేడుకలు ఆగస్ట్ 30న దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో అతిరథ మహారధుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో టాలీవుడ్ పరిశ్రమ నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. గామా అవార్డ్స్ 2025 జ్యూరీ చైర్ పర్సన్స్ ప్రముఖ సినీ దర్శకులు – ఏ. కోదండ రామిరెడ్డి , ప్రముఖ సంగీత దర్శకులు – కోటి , ప్రముఖ సినీ దర్శకులు – బి. గోపాల్ ఆధ్వర్యంలో వివిధ రంగాలకు ఎంపిక అయిన టాలీవుడ్ కళాకారులకు, సినిమాలకు GAMA అవార్డ్స్ బహుకరించబడ్డాయి. నేషనల్ లెవెల్ లో మంచి గుర్తింపును అందుకున్న పుష్ప 2 ది రూల్ చిత్రానికి గానూ.. గామా బెస్ట్ మూవీగా అవార్డ్ కైవసం చేసుకుంది.
గామా అవార్డు గ్రహీతలు:
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
గామా బెస్ట్ యాక్టర్ 2024 – అల్లు అర్జున్ (పుష్ప2 ది రూల్)
గామా బెస్ట్ హీరోయిన్ – మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)
గామా బెస్ట్ మూవీ – పుష్ప 2 (మైత్రి మూవీ మేకర్స్.. యలమంచిలి రవి నవీన్ యెర్నేని)
గామా బెస్ట్ డైరెక్టర్ – సుకుమార్ (పుష్ప 2)
గామా బెస్ట్ ప్రొడ్యూసర్ – అశ్విని దత్, ప్రియాంక దత్, స్వప్న దత్ (కల్కి 2898AD)
గామా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – దేవిశ్రీప్రసాద్ (పుష్ప 2)
బెస్ట్ కొరియోగ్రఫీ : భాను మాస్టర్ (నల్లంచు తెల్లచీర.. మిస్టర్ బచ్చన్)
బెస్ట్ ఎడిటర్ : నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
బెస్ట్ సినిమాటోగ్రఫీ : రత్న వేలు (దేవర)
బెస్ట్ లిరిసిస్ట్ – రామ జోగయ్య శాస్త్రి (చుట్టమల్లే..దేవర)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ : అనురాగ్ కులకర్ణి (సుట్టమలా సూసి.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ : మంగ్లీ (కళ్యాణి వచ్చావచ్చా.. ఫ్యామిలీ స్టార్)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ క్రిటిక్ : సమీరా భరద్వాజ్ (నల్లంచు తెల్లచీర.. మిస్టర్ బచ్చన్)
గామా బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ : రజాకార్
గామా బెస్ట్ యాక్టర్ క్రిటిక్ : తేజ సజ్జా
బెస్ట్ పెర్ఫార్మన్స్ యాక్టర్ జ్యూరీ : రాజా రవీంద్ర (సారంగదరియా)
బెస్ట్ యాక్టర్ జ్యూరీ : కిరణ్ అబ్బవరం (క)
బెస్ట్ ప్రామిసింగ్ యంగ్ యాక్టర్ : రోషన్ (కోర్ట్)
బెస్ట్ ప్రామిసింగ్ యంగ్ యాక్టర్ ఫిమేల్ : శ్రీదేవి (కోర్ట్)
బెస్ట్ ప్రామిసింగ్ యంగ్ యాక్టర్ ఫిమేల్ : మానస వారణాశి
బెస్ట్ ఆస్పైరింగ్ డైరెక్టర్ : అప్సర్ (శివం భజే)
గద్దర్ మెమోరియల్ మ్యూజిక్ అవార్డ్ : మట్ల తిరుపతి
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ : వినయ్ రాయ్ (హనుమాన్)
బెస్ట్ సపోర్టింగ్ పెర్ఫార్మన్స్ అవార్డ్ : హర్ష చెముడు (సుందరం మాస్టర్)
బెస్ట్ సపోర్టింగ్ కామెడీ రోల్ : బాలిరెడ్డి పృథ్వీరాజ్
బెస్ట్ డెబ్యూ యాక్టర్ ఫిమేల్ : నయన్ సారిక (ఆయ్, క)
బెస్ట్ డెబ్యూ యాక్టర్ జ్యూరీ : ధర్మ కాకాని (డ్రింకర్ సాయి)
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ : యదు వంశీ (కమిటీ కుర్రాళ్ళు)
బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్ : నిహారిక కొణిదెల (కమిటీ కుర్రాళ్ళు)
గ్లోబల్ కమెడియన్ గా ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందం స్పెషల్ అవార్డును అందుకున్నారు. వీరితోపాటు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును నిర్మాత అశ్వినీ దత్ అందుకున్నారు.అలాగే హీరో సత్యదేవ్ జీబ్రా చిత్రానికి గాను ప్రామిసింగ్ యాక్టర్ గా అవార్డును కైవసం చేసుకున్నారు. ఫ్యాన్స్ ఫేవరెట్ స్టార్ అవార్డును అందాల భామ ఊర్వశీ రౌటెల అవార్డును అందుకున్నారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!