Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కంటెంట్ ఉంటే కటౌట్ తో పనిలేదని, కథలో దమ్ముంటే బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయమని ‘మండాడి’ సినిమా మరోసారి నిరూపించింది. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా విడుదలై, కేవలం మౌత్ టాక్ తోనే థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తున్న ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన అఫీషియల్ పోస్టర్ చూస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో ఊచకోత కోస్తుందో స్పష్టమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఏకంగా 65 కోట్లకు పైగా గ్రాస్ (65+ Crores Worldwide Gross) వసూలు చేసి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. ఒక భారీ స్టార్ హీరో లేకుండానే, కేవలం బలమైన కథను నమ్ముకుని తీసిన ఈ సినిమా ఈ రేంజ్ కలెక్షన్లు రాబట్టడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
కమెడియన్ స్థాయి నుంచి హీరోగా ఎదిగి, తనలోని ఇంటెన్స్ యాంగిల్ ను ఈ సినిమాలో నటుడు సూరి అద్భుతంగా పండించాడు. అలానే కమెడియన్ స్థాయి నుంచి హీరోగా ఎదిగిన సుహాస్ కూడా తనదైన శైలిలో విలనిజం పండించాడు. దర్శకుడు మదిమారన్ పుగజేంది రాసుకున్న గ్రిప్పింగ్ స్టోరీకి, జీవీ ప్రకాష్ కుమార్ పవర్ ఫుల్ మ్యూజిక్ తోడవడంతో థియేటర్లలో రోమాలు నిక్కబొడుచుకునే ఎక్స్ పీరియన్స్ దొరుకుతోంది. దీనికి తోడు టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ ఈ చిత్రాన్ని తెలుగులో ప్రెజెంట్ చేయడం, నిర్మాత ఎల్రెడ్ కుమార్ రాజీపడని నిర్మాణ విలువలు ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాయి. వర్షంలో సూరి, సుహాస్ తలపడుతున్న ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ తో డిజైన్ చేసిన ఈ 65 కోట్ల కలెక్షన్ల పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కంటెంట్ ఈజ్ కింగ్ అని మరోసారి నిరూపించిన ‘మండాడి’, రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో వేచి చూడాలి!
Also Read
తాజావార్తలు
-
PM Modi: ‘దేశాన్ని పణంగా పెట్టి విఫల ఉత్పత్తిని ప్రమోట్ చేస్తారా?’.. కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు
-
FD Maturity Rules: మెచ్యూర్ అయిన FDని విత్‌డ్రా చేయకపోతే ఏమవుతుంది..? RBI కొత్త రూల్స్ తెలుసుకోండి..
-
Ultraviolette X-47 Venom: అల్ట్రావయోలెట్ X-47 Venom లాంచ్.. 343KM రేంజ్, 77 GHz రియర్ రాడార్, 155 km/h టాప్ స్పీడ్
-
Kusal Mendis: 430 పరుగుల లక్ష్యం చూసి భయపడలేదు.. ఇంగ్లండ్‌పై మా విజయానికి కారణం అదొక్కటే!
-
Aliss Al Islam: బంగ్లాదేశ్ స్పిన్నర్ బౌలింగ్ యాక్షన్‌పై అనుమానం.. ఐసీసీకి రిపోర్ట్.!
ట్రెండింగ్
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!