పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అంటుంటే.. హమాస్‌ను అంతం చేయాల్సిందేనని ట్రంప్ సూచించారు. హమాస్‌ను అంతం చేయాలని.. గాజాలో ఆ పనిని పూర్తి చేయాలని తాజాగా ఇజ్రాయెల్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Cambodia-Thailand War: కంబోడియా కీలక విజ్ఞప్తి.. థాయ్‌లాండ్ తిరకాసు..! ఏం జరుగుతుందో!
అమెరికా మధ్యవర్తిత్వంలో జరిగిన కాల్పుల విరమణ చర్చలు విఫలమయ్యాయి. అమెరికా మద్దతుతో కూడిన కాల్పుల విరమణ ప్రతిపాదనను హమాస్ తిరస్కరించింది. చర్చలు జరపడానికి హమాస్ ఇష్టపడడం లేదని ట్రంప్ పేర్కొన్నారు. ఇక గాజాలో హమాస్‌ను శుభ్రం చేసి.. పని పూర్తి చేయాలని ఇజ్రాయెల్‌ను ట్రంప్ కోరారు. శుక్రవారం ట్రంప్ స్కాట్లాండ్ పర్యటనకు బయల్దేరే ముందు మీడియాతో మాట్లాడారు. హమాస్ నిజంగా ఒప్పందం కుదుర్చుకోవాలని అనుకోవడం లేదని.. అందుకే వారు చనిపోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అందుకోసమే హమాస్‌ను అంతం చేయాలని ఇజ్రాయెల్‌కు సూచించినట్లు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: నేడు సింగపూర్కు సీఎం చంద్రబాబు.. పెట్టుబడులే లక్ష్యంగా పర్యటన
హమాస్ చెరలో బందీగా ఉన్న అమెరికా-ఇజ్రాయెల్ పౌరుడు ఎడాన్ అలెగ్జాండర్ విడుదలకు అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేసింది. స్వయంగా ట్రంప్ కీలక పాత్ర పోషించారు. కానీ చివరి దశలో హమాస్ నో చెప్పింది. హింసను కొనసాగించేందుకే కట్టుబడి ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఇక శాంతి చర్చల నుంచి వెనక్కి తగ్గుతున్నట్లు అమెరికా రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ ప్రకటించారు. ఈ ప్రతిష్టంభనకు హమాసే కారణమని అన్నారు. విట్‌కాఫ్ సరిగ్గా అర్థం చేసుకున్నారని నెతన్యాహు అన్నారు.
2023 అక్టోబర్ 7న హమాస్ నేతృత్వంలోని ఉగ్రవాదులు.. ఇజ్రాయెల్ సరిహద్దు పట్టణాలపై దాడి చేసి 1,200 మందిని చంపి, 251 మందిని బందీలుగా తీసుకెళ్లారు. అనంతరం ఇజ్రాయెల్ సైనిక చర్య ప్రారంభించింది. హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక గాజాకు ఆహానం నిలిచిపోవడంతో ఆకలి చావులతో పౌరులు చనిపోవుతున్నారు.