CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ రాత్రికి హైదరాబాద్ నుంచి సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు.. పరిశ్రమలకు సంబంధించి సింగపూర్ లో సీఎం చంద్రబాబు పర్యటన జరగనుంది. అమరావతి కాపిటల్ డెవలప్మెంట్ లో కూడా సింగపూర్ భాగస్వామ్యం సంబంధించి చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.
అయితే, బ్రాండ్ ఏపీ ప్రమోషన్ లో భాగంగా సింగపూర్ లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన చేయబోతున్నారు. ఈ నవంబర్ లో జరిగే ఇన్వెస్ట్మెంట్ సమిట్ కు సింగపూర్ ప్రతినిధులను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు చంద్రబాబు. ఇక, సీఎంతో పాటు మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ, టీజీ భరత్ సహా ఇతర ఉన్నతాధికారులు సింగపూర్ వెళ్లనున్నారు.