గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే రోజులు దగ్గర పడ్డాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదుర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం మాత్రం ఆ దిశగా అడుగులు పడుతున్నాయి.
ఇది కూడా చదవండి: Mexico Video: మెక్సికోలో కూలిన విమానం.. ఏడుగురు మృతి
తాజాగా బెర్లిన్ వేదికగా జరిగిన చర్చలు సఫలీకృతం అయినట్లుగా తెలుస్తోంది. అమెరికా, యూరోపియన్ దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, నాటో నాయకులు, జెలెన్‌స్కీ మధ్య గంటల తరబడి చర్చలు జరిగాయి. ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ సుదీర్ఘ చర్చలు జరిపారు. ట్రంప్ ప్రతిపాదించిన ప్రతిపాదన ఆధారంగా చర్చలు జరిగాయి. మొత్తానికి సుదీర్ఘ చర్చలు విజయవంతమైనట్లుగా ట్రంప్ ప్రకటించారు. సోమవారం ఓవల్ కార్యాలయంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. జెలెన్‌స్కీ, ఇతర నాయకులతో సుదీర్ఘంగా చాలా మంచి చర్చలు జరిగినట్లుగా ప్రకటించారు.
ఇది కూడా చదవండి: AMB Bengaluru: బెంగళూరు సినిమా లవర్స్’కి షాక్
త్వరలోనే రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం జరిగే సూచనలు కనిసిస్తు్న్నాయి. యుద్ధాన్ని కొనసాగించకూడదని యూరోపియన్ నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఉక్రెయిన్ భద్రతాపై అమెరికా హామీ ఇవ్వడంతో ఈ చర్చలు ఫలించినట్లుగా సమాచారం. వాషింగ్టన్ అందించే కొత్త భద్రతా హామీలపై జెలెన్‌స్కీ సంతోషం వ్యక్తం చేశారు. అయితే రష్యాకు ఏ భూభాగాలు వదులుకోవాల్సి ఉంటుందనే దానిపైనే విభేదాలు మిగిలి ఉన్నాయని వ్యాఖ్యానించారు. అయితే తాజా చర్చలపై మాత్రం రష్యా ఇంకా అధికారికంగా స్పందించలేదు.