Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Polavaram Tragedy: ఏపీలోని పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రంపచోడవరం ఏజెన్సీ పరిధిలోని దామనపల్లి, బోర్నగూడెం గిరిజన గ్రామాలకు చెందిన ఇద్దరు యువతులు ఒకే ప్రియుడి కోసం ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. దామనపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి ఈ నెల 13వ తేదీన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పుంటించుకుని ప్రాణాలు విడిచింది. ఆ ఘటన జరిగిన నాలుగు రోజులు గడవక ముందే, బోర్నగూడెం గ్రామానికి చెందిన మరో యువతి (34) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఒకే యువకుడిని ఇద్దరు యువతులు ప్రేమించడమే ఈ దారుణానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 12వ తేదీన ప్రియుడి విషయంలో ఈ ఇద్దరు యువతుల మధ్య తీవ్ర వివాదం చెలరేగడమే కాకుండా, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు సమాచారం. ఆ గొడవ జరిగిన మరుసటి రోజు నుంచే వరుసగా ఇద్దరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ ఘటనలపై దేవీపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతుల మృతికి గల పూర్తి కారణాలపై పోలీసులు క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!