Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇప్పటివరకు యూనివర్సిటీలో అడ్మిషన్ రావడం, ఫీజులు కట్టడానికి డబ్బు ఉండటం, అవసరమైన డాక్యుమెంట్లు చూపించడం లాంటివి ఉంటే వీసా వస్తుందని చాలామంది అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా అధికారులు మరో విషయం కూడా చాలా లోతుగా చూస్తున్నారు. మీరు నిజంగానే చదువుకోవడానికి ఆస్ట్రేలియా వెళ్తున్నారా? మీరు ఎంచుకున్న కోర్సు మీ చదువు, మీ అనుభవం, మీ భవిష్యత్తు ప్లాన్‌కు సరిపోతుందా? అనే విషయాలను కూడా చూస్తున్నారు.
ఆస్ట్రేలియా హోం అఫైర్స్ శాఖ గణాంకాల ప్రకారం 2026 జూన్‌లో ఆస్ట్రేలియా విద్యార్థి వీసా దరఖాస్తుల్లో 24.2 శాతం తిరస్కరణకు గురయ్యాయి. 2016 జూన్‌లో ఈ సంఖ్య కేవలం 7.9 శాతంగా ఉండేది. అంటే పదేళ్లలో తిరస్కరణ రేటు మూడింతలకు పైగా పెరిగింది. భారతీయుల విషయంలో పరిస్థితి మరింత కఠినంగా ఉంది. 2025 నుంచి 2026 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి వచ్చిన విద్యార్థి వీసా దరఖాస్తుల్లో 40 శాతానికి పైగా రిజెక్ట్ అయ్యాయి.
నేపాల్ విద్యార్థుల పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది. అక్కడ సగానికి పైగా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. అదే సమయంలో చైనా దరఖాస్తుల తిరస్కరణ రేటు 5.8 శాతంగా ఉంది. ఇంతకీ ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఆస్ట్రేలియాకు వచ్చే ప్రతి విద్యార్థి నిజంగానే చదువుకోవడానికి రావాలన్నది అక్కడి ప్రభుత్వ ఉద్దేశం. ఎందుకంటే కొంతమంది చదువు పేరుతో ఆస్ట్రేలియాకు వెళ్లి, ఆ తర్వాత అక్కడే ఉండటానికి ప్రయత్నిస్తున్నారనే ఆందోళన చాలాకాలంగా ఉంది. అందుకే ఇప్పుడు విద్యార్థి వీసా దరఖాస్తును చూసేటప్పుడు చదువే ప్రధాన ఉద్దేశమా అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు.
Also Read
- China: సినిమా హీరోలా? సైన్స్ వీరులా? ప్రపంచానికి కళ్లు తెరిపించిన చైనా
- Mystery Objects: అమెరికా ఆకాశంలో అంతుచిక్కని వస్తువులు! ఈ బ్లాక్ ట్రయాంగిల్స్ రహస్యం ఏంటి?
- META Smart Glasses: రాజకీయాల్లో స్టింగ్ ఆపరేషన్ల దుమారం.. ఆ మెటా గ్లాసెస్ మిస్టరీ ఏంటి?
- GREEN CRACKERS: ఈ దీపావళికి ఊపిరి పీల్చుకోవడం సాధ్యమేనా?
ఉదాహరణకు ఒక విద్యార్థి ఇప్పటివరకు ఒక రకమైన కోర్సు చేశాడు. తర్వాత పని అనుభవం కూడా ఒక రంగంలోనే ఉంది. కానీ ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు అకస్మాత్తుగా పూర్తిగా వేరే కోర్సును ఎంచుకున్నాడు. ఆ కోర్సు ఎందుకు ఎంచుకున్నాడో అతని దగ్గర సరైన వివరణ లేకపోతే అధికారులకు అనుమానం వస్తుంది. ఈ కోర్సు చదివితే తన కెరీర్‌కు ఏం ఉపయోగం, చదువు తర్వాత ఏం చేయాలనుకుంటున్నాడు, ఇప్పటివరకు చేసిన చదువుతో ఈ కోర్సుకు సంబంధం ఏంటి లాంటి విషయాలను కూడా చూస్తారు.
అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్లాలనుకునే విద్యార్థి కేవలం యూనివర్సిటీ అడ్మిషన్ తెచ్చుకుంటే సరిపోదు. తాను ఎంచుకున్న కోర్సు విషయంలో ఒక క్లియర్ స్టోరీ ఉండాలి. నేను ఈ కోర్సునే ఎందుకు ఎంచుకున్నాను, నా గత చదువుతో దీనికి సంబంధం ఏంటి, భవిష్యత్తులో దీనివల్ల నాకు ఏం ఉపయోగం అనే విషయాలు స్పష్టంగా ఉండాలి. అయితే ఇక్కడే మరో సమస్య మొదలవుతోంది. నకిలీ దరఖాస్తులను, చదువు పేరుతో వేరే ఉద్దేశంతో వచ్చే వాళ్లను ఆపడం ఒక విషయం. కానీ అదే సమయంలో నిజంగా చదువుకోవాలని, మంచి కెరీర్ కోసం ఆస్ట్రేలియా వెళ్లాలని అనుకునే విద్యార్థులు కూడా ఈ కఠినమైన నిబంధనల మధ్య ఇబ్బంది పడితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇదే ఇప్పుడు అక్కడి విద్యా రంగంలో ఉన్న కొందరి ఆందోళన.
ఎందుకంటే విదేశీ విద్యార్థులు ఆస్ట్రేలియాకు కేవలం చదువుకోవడానికి మాత్రమే వెళ్లడం లేదు. వాళ్లు అక్కడి యూనివర్సిటీలకు, నగరాలకు, మొత్తం ఆర్థిక వ్యవస్థకు కూడా డబ్బు తీసుకువెళ్తున్నారు. అలాంటి సమయంలో ఆస్ట్రేలియా చాలా కఠినంగా మారిపోయిందనే భావన విద్యార్థుల్లో పెరిగితే, వాళ్లు అమెరికా, బ్రిటన్, కెనడా లేదా ఇతర దేశాల వైపు వెళ్లే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆస్ట్రేలియా ఇప్పుడు ఒక బౌండరీ గీస్తోంది. చదువుకోవడానికి నిజంగా వచ్చే విద్యార్థులకు తలుపులు తెరిచి ఉంచుతూనే, చదువు పేరుతో వేరే ఉద్దేశంతో వచ్చే వాళ్లను ఆపాలని చూస్తోంది. కానీ ఆ బౌండరీ ఎక్కడ ఉండాలన్నదే అసలు విషయం.
నిబంధనలు సడలిస్తే వ్యవస్థను దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. మరీ గట్టిగా చేస్తే నిజమైన విద్యార్థులు కూడా ఆ తలుపు బయటే మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న ఈ 40 శాతానికి పైగా తిరస్కరణలు ఆ చర్చను మరింత పెద్దదిగా చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar: నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. భువీ ప్రదర్శనపై స్పందించిన బౌలింగ్ కోచ్ మోర్కెల్..
-
Arnab Cyclone Alert: తీరం వైపు వడివడిగా ‘అర్నబ్’.. బీచ్‌కు రావొద్దు.. పర్యాటకులకు మెరైన్ పోలీసుల వార్నింగ్
-
Sai Pallavi: ఖాకీ డ్రెస్సులో సాయి పల్లవి మాస్ లుక్.. ‘ఓం’ గ్లింప్స్‌తో నెట్టింట రచ్చ!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Vijay-Rashmika: విరోష్ జంటపై ఫేక్ ప్రచారం.. హైదరాబాద్ సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించిన విజయ్-రష్మిక టీమ్!
ట్రెండింగ్
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!