Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Finance Ministry: అక్టోబర్ 15 నుంచి యూపీఐ (UPI) ద్వారా వ్యాపారులకు (Merchants) రూ. 2,000 కంటే ఎక్కువ చెల్లిస్తే 0.4% మేర మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) వర్తిస్తుందని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. రూ. 75,000 దాటిన లావాదేవీలకు ఈ రుసుము గరిష్టంగా రూ. 300 వరకు పరిమితమవుతుందని స్పష్టం చేసింది. అయితే, ఈ నిర్ణయం వెనుక విదేశీ ఒత్తిళ్లు లేదా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునే వ్యూహం ఉందంటూ ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. ఈ వార్తలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టతనిచ్చింది. విదేశీ ప్రభావం ఉందనేది పూర్తిగా అసత్యమని ఖండించింది. స్వయంసమృద్ధి, అందరికీ అందుబాటులో ఉండే డిజిటల్ పేమెంట్ వ్యవస్థను బలోపేతం చేయడానికే భారత్ స్వతంత్రంగా ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించింది.
కంగారు వద్దు..
Also Read
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
ముఖ్యంగా వినియోగదారులు ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ MDR భారం కస్టమర్లపై పడదు. ఈ రుసుమును కేవలం వ్యాపారుల వద్ద నుంచే వసూలు చేస్తారు. నెలకి రూ. 1 లక్ష కంటే ఎక్కువ యూపీఐ చెల్లింపులు పొందే వ్యాపారులను ‘మర్చంట్స్’గా పరిగణించి వారి నుంచి మాత్రమే దీనిని వసూలు చేస్తారు. ఉదాహరణకు రూ. 10,000 వ్యాపారికి వస్తే, వారు రూ. 40 MDR చెల్లిస్తారు. వినియోగదారుల నుంచి ఈ రుసుమును వసూలు చేయకుండా చూడాలని బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. పైగా, యూజర్లపై ఎలాంటి ప్లాట్‌ఫారమ్ లేదా హిడెన్ ఛార్జీలు విధించకూడదని యూపీఐ యాప్ సంస్థలకు చెప్పడం జరిగింది. సాధారణంగా చేసే P2P (స్నేహితులకు, ఇతరులకు పంపే) బదిలీలు, చిన్న వ్యాపారులకు చేసే చెల్లింపులు ఎప్పటిలాగే పూర్తిగా ఉచితం. ఈ నిర్ణయంతో దాదాపు 96% వ్యాపార లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదు. రైల్వేలు, టెలికామ్, ఇన్సూరెన్స్ వంటి కొన్ని రంగాలకు ఫ్లాట్ రూ. 5 ఛార్జీ, క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలకు 0.02% ఛార్జీ మాత్రమే వర్తిస్తుంది.
తాజావార్తలు
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!