గత కొద్దిరోజులుగా ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇక భద్రతా దళాల కాల్పుల్లో ఇప్పటి వరకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే నిరసన కారులపై కాల్పులు ఆపకపోతే అమెరికాలోకి రంగంలోకి దిగుతుందని ట్రంప్ హెచ్చరించారు. మరోవైపు ఇరాన్‌పై దాడులు చేసేందుకు అమెరికా సైన్యం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Zubeen Garg: జుబీన్ గార్గ్ మృతిపై సింగపూర్ పోలీసులు సంచలన రిపోర్ట్.. ఏం తేల్చారంటే..!
తాజాగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. తన హెచ్చరికలతో ఇరాన్లో హత్యలు, ఉరిశిక్షలు ఆగిపోయాయని తెలిపారు. రోజుల తరబడి హెచ్చరికలు, బెదిరింపులతో ఇరాన్ వెనక్కి తగ్గిందని.. ఇందుకు సంబంధించిన సమాచారం తన దగ్గర ఉందని చెప్పారు. తదుపరి చర్యల గురించి జాతీయ భద్రతా బృందంతో చర్చిస్తున్నట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: Story Board: ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంపై ఇంత దాష్టీకమా..?
ఇదిలా ఉంటే డిసెంబర్ 28 నుంచి జరుగుతున్న నిరసనల్లో దాదాపు 3 వేల మంది వరకు చనిపోయినట్లుగా అధికారిక లెక్కలను బట్టి తెలుస్తోంది. కానీ ఆ సంఖ్య 12 వేల వరకు ఉండొచ్చని సమాచారం. ఇదిలా ఉంటే ఇరాన్‌పై చర్యలు తీసుకునేందుకు పెద్ద ఎత్తున అమెరికా సైనిక విమానాలు ఖతార్‌లో మోహరించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇంకోవైపు ఇరాన్ గగనతలాన్ని ప్రభుత్వం మూసేసింది. అమెరికా దాడులు చేస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో మూసేసినట్లుగా సమాచారం.