Trump: ఇరాన్‌తో యుద్ధం ముగిసింది.. వైట్‌హౌస్ కీలక ప్రకటన
- ఇరాన్‌తో యుద్ధం ముగిసింది
- వైట్‌హౌస్ కీలక ప్రకటన
- ట్రంప్ సందేశాన్ని అమెరికా కాంగ్రెస్‌కు తెలిపిన వైట్‌హౌస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని వైట్‌హౌస్ ప్రకటించింది. ఇరాన్‌తో యుద్ధం ఆపేసినట్లు అమెరికా కాంగ్రెస్‌కు తెలిపింది. వార్ పవర్స్ యాక్ట్ ప్రకారం విధించిన 60 రోజుల గడువు ముగియడంతో ఈ ప్రకటన చేసింది. పశ్చిమాసియాలో అమెరికా దళాలు ఉన్నప్పటికీ యుద్ధం నిలిపివేసినట్లు వెల్లడించింది. యుద్ధం కొనసాగించాలంటే అమెరికా కాంగ్రెస్ అనుమతి తప్పనిసిరి.. ఈ గడువు మే 1న ముగిసింది. దీంతో ట్రంప్ సందేశాన్ని అమెరికా కాంగ్రెస్‌కు వైట్‌హౌస్ పేర్కొంది. ఏప్రిల్ 7న ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది.
అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తలపై ట్రంప్ భిన్న ప్రకటనలు చేశారు. ఇరాన్‌తో వైషమ్యాలు ముగిశాయని అమెరికా కాంగ్రెస్‌కు ట్రంప్ తెలిపారు. అయితే యుద్ధం కొనసాగింపుపై తన అధికారాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. యుద్ధంపై 60 రోజుల్లోగా కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలని చెప్పడం చట్ట విరుద్ధమని.. 60 రోజుల అనుమతి వాదనపై ప్రతిపక్ష డెమోక్రాట్లు దేశభక్తులేకాదని ట్రంప్ ధ్వజమెత్తారు.
Also Read
- Strait of Hormuz: హోర్ముజ్ నుంచి యెమెన్ వరకు హైటెన్షన్.. 86 షిప్స్‌కు అమెరికా బ్రేక్!
- Turkey-SCO: ‘ఎస్సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!
- US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్‌పోర్ట్‌కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
ఏప్రిల్‌లో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటి నుంచి దాడులు జరగలేదని.. అయినా ఇరాన్‌తో ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని.. ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వం అస్తవ్యస్తంగా ఉందని చెప్పారు. ఆయుధాల నిల్వలపై మా దగ్గర గతంలో లేనంతగా బాంబులు, క్షిపణులు ఉన్నాయని వెల్లడించారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా మాకు భారీ స్థాయిలో ఆయుధ సంపత్తి ఉంది. అవసరమైతే మా ఆయుధ సంపత్తి ఎప్పుడైనా ఉపయోగించగలం.
ప్రస్తుతం మేం పూర్తి సన్నద్ధతతో ఉన్నాం. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కంటే ప్రస్తుతం రెట్టింపు ఆయుధ నిల్వలు ఉన్నాయి. దాడులు ఆపినంత మాత్రాన.. యుద్ధం ముగిసినట్లు కాదు.
అమెరికా యుద్ధనౌకలు సముద్ర దిగ్బంధం కొనసాగిస్తున్నాం.’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే వైట్‌హౌస్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ ఒక కొత్త ప్రతిపాదనను పంపిందని.. అయితే దానితో తాను సంతోషంగా లేనని చెప్పారు. ‘‘వారు ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు.. కానీ నేను దానితో సంతృప్తిగా లేను. ఏం జరుగుతుందో చూద్దాం.’’ అని అన్నారు. ఇరాన్ కచ్చితంగా కొన్ని చర్యలు తీసుకుందని.. అయితే చివరికి ఏదైనా ఒప్పందానికి రాగలదో లేదో తనకు కచ్చితంగా తెలియదని పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వం తీవ్రంగా విచ్ఛిన్నమైందన్నారు. అన్ని వర్గాలు ఏదో ఒక రకమైన ఒప్పందాన్ని కోరుకుంటున్నాయని అంగీకరించినప్పటికీ.. ఈ విభజన చర్చల్లో ఇబ్బందులను కలిగిస్తోందని ట్రంప్ అన్నారు.
తాజావార్తలు
-
Devarakonda Family : దేవరకొండ ఫ్యామిలీ నుండి నెలకో సినిమా రిలీజ్‌కు రెడీ
-
BJPలో చేరిన రాఘవ్ చడ్డాకు ఓటర్ లిస్ట్ షాక్.. పంజాబ్ ఓటర్ లిస్ట్‌లో పేరు మాయం!
-
Imam ul Haq Ban: గాయం అంటూ నాటకాలు.. పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌పై రెండేళ్ల నిషేధం!
-
Irumudi Nizam : నైజాంలో ‘ఇరుముడి’ విధ్వంసం.. 13రోజుల్లో రూ. 75 కోట్ల గ్రాస్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
ట్రెండింగ్
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!