వినియోగదారులకు బెస్ట్ కార్లను అందించేందుకు అన్ని కార్ల సంస్థలు ముందుటాయి. దీని కోసం లక్షల్లో డబ్బులు ఖర్చు చేసి కార్లను ముందు ట్రాయల్ యాక్సిడెంట్‌లు కూడా చేస్తుంటాయి. ఈ ప్రక్రియలో కారు ఎప్పుడైనా ప్రమాదానికి గురైనా ఎంతవరకు తట్టుకునేలా రూపొందిస్తుంటారు. అయితే వర్షాకాలంలో, ఈదురు గాలులకు చెట్లు విరిగి పడుతుండే సంఘటనలు చూసే ఉంటాం అయితే.. ఒక్కోసారి చెట్టుక్రింద పార్క్ చేసిన కార్లపై కూడా చెట్లు విరిగిపడిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా.. చైనాలో భారీ వర్షాలు కురిశాయి. అంతకు ముందు బలమైన ఈదురు గాలులు వీచాయి. వాటి ధాటికి వందల ఏళ్ల నాటి పెద్ద చెట్లు కూకటి వేళ్లతో సహా కూలిపోయాయి.
ఇలా నేలవాలని ఓ భారీ వృక్షం సరాసరి టెస్లా కంపెనీకి చెందని మోడల్ 3 కారు మీద పడిపోయింది. వాస్తవానికి అంత పెద్ద చెట్టు మీద పడితే కారు అప్పడం అయిపోతుందని అనుకుంటాం. కానీ టెస్లా తయారీలో చూపిన నాణ్యత కారణంగా కారు స్వల్పంగానే దెబ్బతిన్నది. పైగా అందులో ఉన్న డైవర్ సైతం చిన్న గాయాలతోనే సేఫ్‌గా బయటపడి అక్కడి నుంచి నడుచుకుంటు వెళ్లిపోయాడట. ఈ సంఘటనకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. టెస్లా కారు తయారీలో ఉపయోగించిన గ్లాస్ రూఫ్ మెటీరియల్ ధృడత్వంపై మొదట్లో అనేక సందేహాలు వెల్లువెత్తాయి. ప్రపంచంలో ఇదే అత్యంత సేఫ్ కారు అంటూ అప్పట్లో ఎలాన్‌మస్క్ విమర్శకులకు జవాబు ఇచ్చారు. తాజాగా ఘటనను అప్పటి మస్క్ వ్యాఖ్యలతో ముడిపెట్టి నెటిజన్లు ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.
Meanwhile in China, massive tree falls onto Tesla Model 3 glass roof driver walks away uninjured. @elonmusk once said that @Tesla Model 3 is the safest car in the world. $TSLA pic.twitter.com/uIqj25hIkr
— Jay in Shanghai 电动 Jay 🇨🇳 (@JayinShanghai) June 10, 2022