Threat For Lionel Messi After Attack On Family Store: సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీకి ఓ బెదిరింపు లేఖ వచ్చింది. ‘నీ కోసమే వేచి చూస్తున్నాం’ అంటూ ఆ లేఖలో దుండగులు పేర్కొన్నారు. తొలుత రొసారియాలో మెస్సీ భార్య కుటుంబానికి చెందిన సూపర్ మార్కెట్‌పై తెల్లవారుజామున 14 రౌండ్ల కాల్పులు జరిపిన ఇద్దరు దుండగులు.. అక్కడే ఒక లేఖ వదిలి వెళ్లారు. ‘‘మెస్సీ, నీ కోసమే వెయిట్ చేస్తున్నాం. జావ్‌కిన్ ఒక నార్కో (డ్రగ్ డీలర్), అతడు నిన్న కాపాడలేడు’’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే.. సూపర్ మార్కెట్ మూసి ఉండటంతో, ఆ దుండగులు జరిగిన కాల్పుల్లో ఎవ్వరికీ గాయాలు కాలేదు.
R Krishnaiah: కేంద్రమంత్రులకి కృష్ణయ్య వార్నింగ్.. బీసీల వాటా ఇవ్వకపోతే రాష్ట్రంలో తిరగనియ్యం
ఇంతకీ.. లేఖలో దుండగులు పేర్కొన్న జావ్‌కిన్ మరెవ్వరో కాదు, రొసారియో మేయర్. ఆయన పూర్తి పేరు పాబ్లో జావ్‌కిన్. ఆ సూపర్ మార్కెట్ మెస్సీ భార్య ఆంటోనెలా రొకజో కుటుంబానికి చెందినదిగా ఆయన కన్ఫమ్ చేశారు. నగరంలో కేవలం అల్లర్లు సృష్టించడం కోసమే.. ఆ దుండగులు ఈ దాడికి పాల్పడి ఉంటారని ఆయన పేర్కొన్నారు. ‘‘మెస్సీలాంటి స్టార్ సాకర్‌పై దాడి చేస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఆ ఘటన వైరల్ అవ్వకుండా ఉంటుందా?’’ అని తెలిపారు. కేవలం తమపై దృష్టి మరల్చడం కోసం, వైరల్ అవ్వడం కోసమే ఈ దాడి చేశారని.. దీని వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని వ్యాఖ్యానించారు. దీని వల్ల దుండగులకు వచ్చే ప్రయోజనమూ ఏమీ లేదని, ఇదంతా డ్రగ్ మాఫియా పనేనని పోలీసులు సైతం స్పష్టం చేశారు.
Bandi Sanjay: కన్నతల్లిని చంపి.. దండేసి కీర్తించే బాపతు కేసీఆర్
ఈ కాల్పుల ఘటనను ప్రత్యక్షంగా వీక్షించిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చారని, వారిలో ఒకరు దిగి కాల్పులు జరిపాడని, అనంతరం ఒక నోట్ అక్కడ పడేసి ఇద్దరూ వెళ్లిపోయారని తెలిపాడు. మరోవైపు.. ఈ కేసు ప్రాసిక్యూటర్ ఫెడెరికో రెబోలా మాట్లాడుతూ.. గతంలో రోకజో కుటుంబానికి ఎలాంటి బెదిరింపులు రాలేదని స్పష్టం చేశారు. ఈ ఘటన తమని చాలా ఆందోళనకు గురి చేస్తోందని, దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తమ వద్ద వీడియో ఇమేజెస్ ఉన్నాయని, నిందితుల్ని గుర్తించేందుకు మరిన్ని కెమెరాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు.